AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీచ్‌లో దర్శనమిస్తున్న వింత జీవులు.. వీటిని ముట్టుకుంటే మటాషే!.. ఇంతకు ఏంటవి?

Floating Terrors: ఈ విశ్వంలో అనేక రకాల జీవులు నివసిస్తున్నాయి.. వాటిలో కొన్ని మానవులతో పాటు జీవిస్తుండగా.. మరికొన్ని సముద్రాలు, అడవులు.. ఇలా వేరే వేరే చోట్ల తమ జీవనాన్ని కొనసాగిస్తాయి. అయితే కొన్ని సార్లు మనుషుడు ఎప్పుడూ చూడని జీవులు జనావాలసాల్లోకి వచ్చి ఆందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా అలాంటి ఒక జీవి లండన్‌ బీచ్‌లో దర్శనమిచ్చింది. ఇంతకు ఆ జీవి ఏదో తెలుసుకుందాం పదండి.

బీచ్‌లో దర్శనమిస్తున్న వింత జీవులు.. వీటిని ముట్టుకుంటే మటాషే!.. ఇంతకు ఏంటవి?
Floating Terrors
Anand T
|

Updated on: Nov 04, 2025 | 11:01 AM

Share

యూకేలోని ఒక బీచ్‌లో వింత జీవులు ప్రత్యక్షమయ్యాయి. అవే సముద్ర జలాల్లో జీవింతే పోర్చుగీస్ మ్యాన్ ఓ’ వార్” అనే జీవివులు ఇవి చాలా ప్రమాదకరమైనవి.. ఇటీవల సముంద్రంలోంచి పెద్ద సంఖ్యలో ఇవి ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. వీటిని ఫ్లోటింగ్ టెర్రర్స్ (తేలియాడే భయానక జీవులు)గా అని కూడా పిలుస్తారు. ఇవి అబెరావాన్‌తో పాటు పెంబ్రోక్‌షైర్, గ్వినెడ్, ఆంగ్లెసీ వంటి తీర ప్రాంతాల్లో కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.ఈ క్రమంలో ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ వింత జీవులను ప్రజలు ఎవరూ ముట్టుకోవద్దని.. అవి చాలా ప్రమాదకరమైనవి తెలిపారు.

ఇవి సాధారణంగా జెల్లీఫిష్‌ల మాదిరి కనిపిస్తాయి.. కానీ అత్యంత విషపూరితమైన జీవులు. ఒక వేళ్ల పొరపాటున దీని టెంటకిల్స్ మన చర్మానికి తగిలితే మనకు తీవ్రమైన నొప్పి, దద్దుర్లు, బొబ్బలు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు.. వీటి వల్ల కొన్నిసార్లు తీవ్ర జ్వరం, శ్వాసకోస సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే ఇవి చనిపోయిన తర్వాత కూడా వాటి టెంటకిల్స్ ఇంకా విషంతో నిండి ఉంటాయి. అందుకే ప్రజలు ఎవ్వరూ ఎప్పటి పరిస్థితుల్లో వాటి దరిదాపుల్లోకి వెళ్లవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

పోర్చుగీస్ మ్యాన్ ఓ’వార్ అంటే ఏమిటి?

పోర్చుగీస్ మ్యాన్ ఓ’ వార్‌ను చూసిన వెంటనే చాలా మంది ఇది జెల్లీ ఫిష్‌గా అనుకుంటారు, కానీ వాస్తవానికి ఇది సైఫోనోఫోర్ – అంటే అనేక చిన్న జీవులు ఒక సమూహంగా ఏర్పడి జీవించే ప్రత్యేకమైన జీవి. వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌ల ప్రకారం, ఈ సముద్ర ఉదారంగు శరీరం, గులాబీ రంగు శిఖరంతో పొడవైన నీలిరంగు టెంటకిల్స్‌తో కనిపిస్తుంది. ఇవి సాధారణంగా సముద్ర నీటిలో తేడియాడుతూ ఉంటాయి. ఏవైనా బలమైన తుఫాన్‌లు, అలలు వచ్చినప్పుడు ఇవి సముద్ర తీరాలకు కొట్టుకొస్తాయని నిపుణులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • తాకడం మానుకోండి: ఈ జీవులు మీకు ఎక్కడైనా కనిపిస్తే వాటికి దూరంగా ఉండండి.. అవి చనిపోయినట్లు కనిపించినా వాటిని తాకవద్దు
  • సముద్రపు నీటితో శుభ్రం చేసుకోండి: పొరపాటున వాటిని తాకినా, అవి మీమ్మల్ని ముట్టుకున్నా.. ఆ ప్రభావిత ప్రాంతాన్ని సముద్రపు నీటితో శుభ్రం చేయండి.
  • టెంటకిల్స్ తొలగించండి: వీటి టెంటకిల్స్ మీ శరీరంపై ఉంటే వాటిని ఏదైనా కార్డ్ వంటి వస్తువును ఉపయోగించి టెంటకిల్స్‌ను జాగ్రత్తగా తొలగించండి.
  • వైద్య సహాయం తీసుకోండి: మీరు అనుకోకుండా దాని బారిన పడితే కచ్చితంగా ఆ ప్రాంతాన్ని వేడి నీటిలో ముంచి వెంటనే వైద్య సలహా తీసుకోండి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..