ఈక్వెటోరియల్ గినియాలో దాదాపు 80 రోజులుగా తమను నిర్భందించారని.. తామున్న నౌకను నైజీరియా తీసుకెళ్తున్నారని.. కేంద్ర ప్రభుత్వమే ఎలాగైనా రక్షించాలని కోరుతూ 16 మంది భారత నౌకలోని సిబ్బంది విడుదల చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దాదాపు 50 సెకన్ల పాటు ఉన్న రెండు వీడియోలను వారు విడుదల చేశారు. భారత్‌కు చెందిన ఎమ్‌టీ హీరోయిక్ ఇడున్‌లో పనిచేసే పదహారు మంది సిబ్బందిని ఆగస్టు 13న ఈక్వెటోరియల్ గినియాలోని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందుకు కారణం తమ దేశ జెండాను హీరోయిక్ ఇడున్ నౌక మీద ప్రదర్శించకపోవడమే అని సమాచారం. అయితే అప్పటి నుంచి నౌకాసిబ్బందిని అందులోనే నిర్భందించి ఉంచారు. తాజాగా నౌక సిబ్బంది రెండు వీడియోలను విడుదల చేసింది. ఆ వీడియోలలో.. తమను గినియాలో నిర్భందించి ఉంచారని, నౌకను నౌజీరియా వైపు తీసుకెళ్తన్నారని, భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి తమను రక్షించాలని.. వారు కోరారు. నౌక చీఫ్ కమాండర్ సాను జోష్ మాట్లాడూతూ ‘‘ మమ్మల్ని మార్షల్ దీవులలో నిర్భందించారు. మా అందరినీ బలవంతంగా నైజీరియా తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వేళ అదే జరిగితే ఇది దోపిడీదారుల పని కాదు. మాకు భారత ప్రభుత్వ సహాయం కావాలి’’ అని అన్నారు.
16 Indian sailors, member of 26 member crew of a ship detained and held captive in Equatorial Guinea on suspicion of oil theft plead to Indian government for their release. They have been in detention since mid August 2022. pic.twitter.com/1N93s7cP31
ఇవి కూడా చదవండి— Piyush Rai (@Benarasiyaa) November 9, 2022
‘‘ మేము తిరిగి మా కుటుంబాలతో ఎప్పుడు మాట్లాడుతామో తెలియదు. దమచేసి మమ్మల్ని కాపాడండి’’ అంటున్న నౌక సిబ్బంది ఆర్తనాధాలు ఒక వీడియోలో వినపడుతున్నాయి. ‘‘ మా అందరినీ నౌజీరియా తీసుకెళ్లబోతున్నారని చెప్పారు. దయచేసి కాపాడండి. కాపాడమని భారత ప్రధానికి, విదేశాంగ మంత్రికి విన్నపించుకుంటున్నాము. త్వరలోనే మా సెల్ ఫోన్‌లు లాగేసుకుంటారు. మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తామో కూడా తెలియదు’’ అని నౌకలోని అధికారి రోషన్ అరోరా మరో వీడియోలో తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం.