డోర్‌బెల్ కొట్టి ఆటపట్టించారని ముగ్గురు టీనేజర్ల హత్య.. మద్యం మత్తులో కారును వెంబడించి.. చివరకు..

ఇంటి డోర్‌బెల్‌ మోగించి ఆటపట్టించారన్న కారణంతో ముగ్గురు టీనేజ్‌ కుర్రాళ్లను హత్య కేసులో.. భారత సంతతి వ్యక్తి దోషిగా తేలాడు. అమెరికా కాలిఫోర్నియాలోని రివర్‌సైడ్ కౌంటీ నివాసం ఉంటున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తి.. రాత్రిపూట తన ఇంటి డోర్‌బెల్‌ మోగించి ఆటపట్టించారన్న కారణంతో ముగ్గురిని కారుతో ఢీకొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.

డోర్‌బెల్ కొట్టి ఆటపట్టించారని ముగ్గురు టీనేజర్ల హత్య.. మద్యం మత్తులో కారును వెంబడించి.. చివరకు..
Crime News

Updated on: May 01, 2023 | 9:39 AM

ఇంటి డోర్‌బెల్‌ మోగించి ఆటపట్టించారన్న కారణంతో ముగ్గురు టీనేజ్‌ కుర్రాళ్లను హత్య కేసులో.. భారత సంతతి వ్యక్తి దోషిగా తేలాడు. అమెరికా కాలిఫోర్నియాలోని రివర్‌సైడ్ కౌంటీ నివాసం ఉంటున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తి.. రాత్రిపూట తన ఇంటి డోర్‌బెల్‌ మోగించి ఆటపట్టించారన్న కారణంతో ముగ్గురిని కారుతో ఢీకొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. 16 ఏళ్ల వయసున్న ముగ్గురు యువకులు కాల్పుల్లో మరణించిన ఘటన 2020 జనవరి 19న చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. రివర్‌సైడ్‌ కౌంటీ నివాసి అనురాగ్‌ చంద్రను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే, అతను పొంతన లేని సమాధానం చెప్పడంతో అరెస్టు చేశారు. అనంతరం అనురాగ్ చంద్ర నుంచి కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు న్యాయస్థానానికి సమర్పించగా.. కోర్టు అనురాగ్ చంద్రను దోషిగా తేల్చింది. మూడు హత్యల కేసులో అనురాగ్ చంద్ర దోషిగా తేలినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.

కొందరు టీనేజర్లు తన ఇంటి డోర్‌బెల్‌ను మోగించి ఆటపట్టించారని, ఆ సమయంలో తాను పదమూడు బీర్లు తాగి మత్తులో ఉన్నానని తెలిపాడు. తన కుటుంబ సభ్యుల భద్రత గురించి ఆందోళన చెందానని.. దీంతో కాల్పులు జరిపినట్లు అనురాగ్ చంద్ర విచారణలో తెలిపాడు. అంతేకాకుండా వారు తన వెనుక భాగంపై కొట్టి కారులో పారిపోవడానికి ప్రయత్నించారని, అప్పుడు వారిని నిలదీసేందుకు అనుసరించానని.. ఈ క్రమంలో అనుకోకుండా తన కారు వారి వాహనాన్ని ఢీకొట్టినట్లు పేర్కొన్నాడు. వారి వాహనం వేగంతో చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురు కుర్రాళ్లు ప్రాణాలు కోల్పోయారు.

అయితే, ఈ కేసులో అనురాగ్ చంద్రకు పెరోల్‌ అవకాశం లేకుండా యావజ్జీవ శిక్ష పడొచ్చని స్థానిక మీడియా వెల్లడించింది. అప్పిల్ కు వెళ్లినా తీర్పు ఇలానే వచ్చే అవకాశముందని.. పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..