AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Man: కట్టుకున్న భార్యపై కత్తితో దాడి చేసిన భర్త.. చివరకు జరిగిందిదే

పెళ్లి చేసుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటారనుకుంటే కిరాతకానికి పాల్పడ్డాడొకడు. భార్యతో వేగలేక అగ్ని సాక్షిగా కట్టిన తాళిని తన చేత్తోనే తెంచేశాడు. చివరికి కటకటాల వెనుక ఊచలు లెక్కెడుతున్నాడు. ఇంతకూ ఈ కిరాతకుడి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇతని పేరు మాథ్యూ.. తన భార్య కారును అడ్డుకుని ఆమెను పదే పదే నరికి చంపాడు. ఆపై డ్రైవింగ్ చేయడానికి ముందు తన భార్య మృతదేహాన్ని నేలపై ఈడ్చుకెళ్లాడని పోలీసులు తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడా

Indian Man: కట్టుకున్న భార్యపై కత్తితో దాడి చేసిన భర్త.. చివరకు జరిగిందిదే
Indian Man In America Kills His Wife By Stabbing Her 17 Times, Now Jailed For Life
Srikar T
|

Updated on: Nov 06, 2023 | 6:21 PM

Share

పెళ్లి చేసుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటారనుకుంటే కిరాతకానికి పాల్పడ్డాడొకడు. భార్యతో వేగలేక అగ్ని సాక్షిగా కట్టిన తాళిని తన చేత్తోనే తెంచేశాడు. చివరికి కటకటాల వెనుక ఊచలు లెక్కెడుతున్నాడు. ఇంతకూ ఈ కిరాతకుడి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇతని పేరు మాథ్యూ.. తన భార్య కారును అడ్డుకుని ఆమెను పదే పదే నరికి చంపాడు. ఆపై డ్రైవింగ్ చేయడానికి ముందు తన భార్య మృతదేహాన్ని నేలపై ఈడ్చుకెళ్లాడని పోలీసులు తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో 2020లో తన భార్య నర్సుగా పనిచేస్తున్న ఆసుపత్రి పార్కింగ్ స్థలంలోనే ఆమెను దారుణంగా హత్య చేసినట్లు రుజువైంది. ఈ కేసులో భారతీయ వ్యక్తికి జీవిత ఖైదు విధించబడిందని ది సన్ సెంటినెల్ వార్తాపత్రిక నివేదించింది.

అయితే మాథ్యూ ఈ హత్యపై ఇలా చెప్పుకొచ్చాడు. తన భార్య మెరిన్ జాయ్ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. పైగా నా భార్య నాతో సంబంధం నుండి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తోందని చెప్పినట్లు ఈ పత్రికలో ప్రచురించింది. దీనిపై కోర్టును ఆశ్రయించిన మాథ్యూకు మరణశిక్ష విధించే అవకాశం నుండి తప్పించిందని నివేదిక పేర్కొంది. 2020లో బ్రోవార్డ్ హెల్త్ కోరల్ స్ప్రింగ్స్‌లో నర్సుగా పనిచేసే 26 ఏళ్ల జాయ్ 17 సార్లు కత్తిపోట్లకు గురయ్యారు. మాథ్యూ తన కారుతో ఆమెను అడ్డగించాడని, పదేపదే ఆమెను నరికి చంపాడని పోలీసులు తెలిపారు. ఆపై డ్రైవింగ్ చేయడానికి ముందు ఆమె శరీరంపై నేలపై పడేసి అతి కిరాతకంగా లాక్కెళ్లినట్లు వివరించారు.

ఆమె సహోద్యోగుల్లో ఒకరు ఈ సంఘటనపై స్పందించారు. ఆమెకు సహాయం చేసే క్రమంలో జాయ్ వారితో బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. దీంతో జాయ్ స్నేహితులు కేకలు వేశారు. చనిపోయే ముందు చాల సార్లు నాకు పాప ఉంది. కాపాడండి అని ప్రాదేయపడినట్లు వివరించారు.  చివరకు తన స్నేహితులలో ఒకరు జాయ్ పై దాడి చేసిన వ్యక్తిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం, మాథ్యూ కూడా తనకు శిక్ష విధించకండి అని పదే పదే ప్రాదేయపడ్డారు. అయితే అతనికి ఎటువంటి అవకాశం కల్పించకుండా రాష్ట్ర జైలులో జీవిత ఖైదు విధించేలా ఆదేశించింది కోర్టు. అంతేకాకుండా ఘోరమైన ఆయుధంతో దాడి చేసినందుకు గరిష్టంగా ఐదు సంవత్సరాలు శిక్ష విధించాలని తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ తీర్పుపై ప్రతివాది అప్పీల్ చేయడానికి తన హక్కును వదులుకుంటున్నందున మరణశిక్షను మినహాయించాలని రాష్ట్ర అటార్నీ కార్యాలయ ప్రతినిధి పౌలా మక్‌మాన్ అన్నారు. ఈయన చేసిన ఘాతుకం వల్ల జాయ్ కుటుంబం తీవ్ర నష్టంతో కృంగిపోయిందని జాయ్ కుటుంబంలోని బంధువు అయిన జోబీ ఫిలిప్ అన్నారు. అతను టంపాలో నివసించే ప్రాంతం నుంచే జూమ్‌లో శుక్రవారం జరిగిన ఉదంతాన్ని వీక్షించినట్లు తెలిపారు. జాయ్ తల్లి “తన కూతురిని చంపిన వ్యక్తి శాశ్వతంగా జైలులో ఉంటాడన్న వార్త విని ఆనందించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ