Vivek Ramaswamy: నేను గెలిస్తే వారి పిల్లల పౌరసత్వాన్ని రద్దు చేస్తా: వివేక్ రామస్వామి మరో సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగేందుకు పోటీపడుతున్న నేతల మధ్య రెండో చర్చా కార్యక్రమం జరిగింది. కాలిఫోర్నియాలోని సిమి వ్యాలీలో జరిగిన రెండో రిపబ్లికన్ డిబేట్‌లో ఆయనతోపాటు మరో ఆరుగురు పాల్గొన్నారు. డాక్యుమెంట్లు లేని వలసదారులు, అమెరికాలో జన్మించిన వారి పిల్లలను దేశం నుంచి పంపేందుకు ఏ చట్టపరమైన హామీ ఇస్తారని అడగ్గా.. జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు 2015లో అప్పటి అభ్యర్థిగా ట్రంప్ చేసిన ప్రతిపాదనను ప్రస్తావించారు

సంచలన విధానాలకు కేరాఫ్‌గా మారిన భారత సంతతి అమెరికన్ నేత వివేక్ రామస్వామి తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే.. దేశంలో అక్రమ వలసదారుల పిల్లలకు ఇచ్చే ‘బర్త్ రైట్ సిటిజన్‌షిప్’ను రద్దు చేస్తానని రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవి బరిలో నిలిచేందుకు రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం ఆయన పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగేందుకు పోటీపడుతున్న నేతల మధ్య రెండో చర్చా కార్యక్రమం జరిగింది. కాలిఫోర్నియాలోని సిమి వ్యాలీలో జరిగిన రెండో రిపబ్లికన్ డిబేట్‌లో ఆయనతోపాటు మరో ఆరుగురు పాల్గొన్నారు. డాక్యుమెంట్లు లేని వలసదారులు, అమెరికాలో జన్మించిన వారి పిల్లలను దేశం నుంచి పంపేందుకు ఏ చట్టపరమైన హామీ ఇస్తారని అడగ్గా.. జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు 2015లో అప్పటి అభ్యర్థిగా ట్రంప్ చేసిన ప్రతిపాదనను ప్రస్తావించారు. అక్రమ వలసదారుల పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని తొలగిస్తానని చెప్పారు. గతంలో ఉద్యోగాల తొలగింపు, హెచ్1బీ వీసా, తదితర అంశాలపైనా వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తన ప్రత్యర్థులు చేసిన కొన్ని ప్రతిపాదనలకూ వివేక్ మద్దతునిచ్చారు. అమెరికా దక్షిణాన ఉన్న సరిహద్దు వద్ద భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేయాలని, మెక్సికో, సెంట్రల్ అమెరికా దేశాలకు ఆర్థిక సాయం నిలిపివేయాలన్న ప్రతిపాదనలను సబబేనని చెప్పారు.
రేసులో దూసుకెళుతోన్న వివేక్ రామస్వామి..
మరోవైపు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో వివేక్ రామస్వామి జెట్ స్పీడ్‌లో దూసుకెలుతున్నారు. ఇటీవల నిర్వహించినటువంటి జీవోపీ పోల్స్‌లో ఆయన మూడో స్థానం నుంచి ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్నటువంటి ఈ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 39 శాతం మంది మద్దతుతో అగ్రస్థానంలో స్థానంలో ఉన్నారు. 13 శాతం మంది మద్దతులో వివేక్ రామస్వామి రెండో స్థానంలో ఉన్నారు. కాగా ఈసారి మొత్తం ఎనిమిది మంది పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచారు. భారత సంతతికి చెందిన మరో నేత నిక్కీ హేలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ తదితరులు అమెరికా అధ్యక్ష బరిలో నిలుస్తున్నారు.
డిబేట్ కు ముందు వివేక్ రామస్వామి..
View this post on Instagram
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




