ఆస్ట్రేలియాలో కార్మికుల కొరత.. భారత్‌కు ఆహ్వానం

| Edited By:

Aug 02, 2019 | 10:27 AM

స్వల్ప కాలిక వ్యవధిలో ఆస్ట్రేలియాలో ఉపాధి పొందేందుకు “వర్కింగ్ హాలిడే మేకర్” వీసాను తీసుకొచ్చింది అస్ట్రేలియా ప్రభుత్వం. ముఖ్యంగా ఆ దేశంలో ఏర్పడ్డ వ్యవసాయ కార్మికుల కొరతను అధిగమించేందుకు ఈ వీసాలను ఇవ్వాలనుకుంటుంది. ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ హాలిడే మంత్రి డేవిడ్ కోల్‌మేన్ ఈ విషయాలను వెల్లడించారు.ఆస్ట్రేలియాలోని వేర్వేరు ప్రాంతాల్లో నెలకొన్న కార్మిక కొరతను అధిగమించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. వర్కింగ్ హాలిడే మేకర్ కార్యక్రమంతో చేపట్టిన వర్కింగ్ హాలిడే, వర్క్ అండ్ […]

ఆస్ట్రేలియాలో  కార్మికుల కొరత.. భారత్‌కు ఆహ్వానం
Follow us on

స్వల్ప కాలిక వ్యవధిలో ఆస్ట్రేలియాలో ఉపాధి పొందేందుకు “వర్కింగ్ హాలిడే మేకర్” వీసాను తీసుకొచ్చింది అస్ట్రేలియా ప్రభుత్వం. ముఖ్యంగా ఆ దేశంలో ఏర్పడ్డ వ్యవసాయ కార్మికుల కొరతను అధిగమించేందుకు ఈ వీసాలను ఇవ్వాలనుకుంటుంది. ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ హాలిడే మంత్రి డేవిడ్ కోల్‌మేన్ ఈ విషయాలను వెల్లడించారు.ఆస్ట్రేలియాలోని వేర్వేరు ప్రాంతాల్లో నెలకొన్న కార్మిక కొరతను అధిగమించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

వర్కింగ్ హాలిడే మేకర్ కార్యక్రమంతో చేపట్టిన వర్కింగ్ హాలిడే, వర్క్ అండ్ హాలిడే వీసాలతో 13 దేశాల నుంచి స్వల్పకాలిక వ్యవధిలో అవకాశాలు కల్పించునున్నట్టు మంత్రి కోల్‌మేన్ వివరించారు. అస్ట్రేలియా ఆఫర్ చేసిన దేశాల్లో భారత్‌తో పాటు బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్, స్విడ్జర్లాండ్, ఫిజీ, సొలొమన్ దీవులు, క్రోషియా, లాట్వియా, లూథియానా, అండొర్రా, మొనాకో, మంగోలియా దేశాలున్నాయి. ఈ దేశాలనుంచి తగిన ఉపాధికోసం అప్లై చేసుకోవచ్చు. ఈ వీసాలు పొందిన వారు ప్రభుత్వం చెప్పిన ప్రదేశాల్లో పనిచేయాల్సి ఉంటుందని మంత్రి డేవిడ్ కోల్‌మేన్ చెప్పారు.