India: మరోసారి మానవత్వం చాటుకున్న భారత్.. భూకంపంతో అల్లాడుతున్న అఫ్గాన్ కు చేయూత

తీవ్ర భూకంపంతో కకావికలమైన అఫ్గానిస్థాన్(Afghanistan) కు సహాయం అందించేందుకు భారత్ ముందడుగు వేసింది. అఫ్గాన్ కు అవసరమైన పరికరాలు, ఇతర సహాయ సామగ్రిని అధికారులు కాబూల్‌కు(Earthquake in Afghanistan) తరలించారు. ఈ మేరకు...

India: మరోసారి మానవత్వం చాటుకున్న భారత్.. భూకంపంతో అల్లాడుతున్న అఫ్గాన్ కు చేయూత
India Helps Afghanistan

Updated on: Jun 24, 2022 | 1:41 PM

తీవ్ర భూకంపంతో కకావికలమైన అఫ్గానిస్థాన్(Afghanistan) కు సహాయం అందించేందుకు భారత్ ముందడుగు వేసింది. అఫ్గాన్ కు అవసరమైన పరికరాలు, ఇతర సహాయ సామగ్రిని అధికారులు కాబూల్‌కు(Earthquake in Afghanistan) తరలించారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భూకంపంలో దెబ్బతిన్న అఫ్గాన్‌కు సహాయం అందించిన మొదటి దేశం భారత్ కావడం విశేషం. సహాయ సామగ్రితో పాటు ఓ సాంకేతిక బృందాన్ని కూడా అఫ్గాన్ కు పంపించారు. భారత్‌ నుంచి వెళ్లిన బృందంలోని సభ్యులు తాలిబన్లతో కలిసి మనవతా సాయం పంపిణీని పర్యవేక్షించనున్నారు. భారత దౌత్య బృంద భద్రతకు తాలిబన్లు చాలా సార్లు హామీలు ఇచ్చాక ఈ టెక్నికల్‌ టీమ్‌ పంపించడం గమనార్హం.

ఆఫ్గనిస్తాన్‌లో సంభవించిన భూకంపం పెనువిషాదాన్ని నింపుతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 950మందికి పైగా మృతి చెందారు. 600 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని హెలికాఫ్టర్ల ద్వారా ఆస్పత్రికి తరలిస్తున్నారు. భూప్రకంపనల ధాటికి వందలాది భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకొని వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. రాత్రిపూట అందరూ నిద్రిస్తున్న సమయంలో భూకంపం సంభవించడంతో ప్రాణ నష్టం భారీగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. భూకంపం కారణంగా భారీగా ఆస్తినష్టం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి