AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Pakistan: భారత్‌ సాయం చేస్తే.. పాకిస్తాన్‌ను లేపేస్తాం.. బీఎల్ఏ సంచలన ప్రకటన..

భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.. సోమవారం ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. భారత్‌కు మద్దతు ప్రకటించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ .. పాకిస్తాన్ పై దాడి చేయాలని విజ్ఞప్తి చేసింది. పశ్చిమ సరిహద్దు నుండి మద్దతు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

India-Pakistan: భారత్‌ సాయం చేస్తే.. పాకిస్తాన్‌ను లేపేస్తాం.. బీఎల్ఏ సంచలన ప్రకటన..
Balochistan Liberation Army
Shaik Madar Saheb
|

Updated on: May 11, 2025 | 7:44 PM

Share

భారత్ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.. సోమవారం ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. భారత్‌కు మద్దతు ప్రకటించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ .. పాకిస్తాన్ పై దాడి చేయాలని విజ్ఞప్తి చేసింది. పశ్చిమ సరిహద్దు నుండి మద్దతు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పాక్‌పై భారత్ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే.. పాక్‌పై దాడి చేస్తామని పేర్కొంది.. భారత్ చర్యను మేం స్వాగతిస్తున్నామని.. భారత్‌కు సైనిక శక్తిగా నిలుస్తామని ప్రకటించింది.. పాక్‌ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలంటూ కోరింది.

పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) భారతదేశం నుంచి సహాయం కోరుతూ.. ఆదివారం లేఖ రాసింది.. భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేయాలని కోరింది. భారతదేశం ఒక అడుగు ముందుకు వేయాలి.. పశ్చిమ దేశాల నుండి దానిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏ దేశానికీ కీలుబొమ్మ కాదని, ప్రాంతీయ సైనిక.. రాజకీయ సమీకరణాలలో నిర్ణయాత్మక పార్టీగా ఎదిగిందని స్పష్టం చేసింది.

పాకిస్తాన్ శాంతి – కాల్పుల విరమణ ప్రకటనలను తప్పుడు ప్రచారం.. మోసంగా BLA అభివర్ణించింది. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక చర్య మాత్రమే అని లేఖలో పేర్కొంది. పాకిస్తాన్ మాటలకు బలైపోవద్దని, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని తాము భారతదేశం, ప్రాంతీయ శక్తులకు విజ్ఞప్తి చేస్తున్నామని కోరింది.. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించిన BLA, పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా పనిచేస్తుందని పేర్కొంది.

పాక్ సైన్యాన్ని ఓడించాం.. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ..

ఎలాంటి బాహ్య మద్దతు లేకుండా, బలూచిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ లాంటి అణ్వాయుధ శక్తిని అనేక రంగాల్లో ఓడించామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్‌ను దాని మూలాల నుండి నిర్మూలించడానికి భారతదేశం తమకు రాజకీయ, దౌత్య, సైనిక మద్దతు ఇవ్వాలి. పాకిస్తాన్ ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో ఉగ్రవాదం, అస్థిరత కొనసాగుతాయని బిఎల్‌ఎ తెలిపింది.

భారతదేశం పాకిస్తాన్‌ను నాశనం చేయాలని నిర్ణయించుకుంటే, పశ్చిమ సరిహద్దు నుండి సైనిక మద్దతు అందించడానికి BLA సిద్ధంగా ఉందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. ప్రపంచం ఈ అవకాశాన్ని గుర్తించకపోతే, బలూచ్ ప్రజలు ఈ పోరాటాన్ని స్వయంగా కొనసాగిస్తారని BLA చెప్పింది. స్వతంత్ర బలూచిస్తాన్ మాత్రమే ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, సమతుల్యత, ఉగ్రవాదాన్ని అంతం చేయగలదని BLA పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..