మయన్మార్ నుంచి ఎవరు వచ్చినా వెనక్కి పంపేయండి, హోమ్ శాఖ ఆదేశాలు
మయన్మార్ నుంచి ప్రజలు గానీ, పోలీసులు గానీ ఎవరు సరిహద్దులు దాటి వచ్చినా వారిని వెనక్కి పంపివేయాలని హోం శాఖ... పారామిలిటరీ అస్సాం రైఫిల్స్ ని ఆదేశించింది. సరైన వీసా గానీ, అధికారికపత్రాలు గానీ లేకుండా ఆ దేశం నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిన పక్షంలో..
మయన్మార్ నుంచి ప్రజలు గానీ, పోలీసులు గానీ ఎవరు సరిహద్దులు దాటి వచ్చినా వారిని వెనక్కి పంపివేయాలని హోం శాఖ… పారామిలిటరీ అస్సాం రైఫిల్స్ ని ఆదేశించింది. సరైన వీసా గానీ, అధికారికపత్రాలు గానీ లేకుండా ఆ దేశం నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిన పక్షంలో.. వారిని తిప్పి పంపాలని తమకు స్పష్టంగా ఆదేశాలు అందినట్టు అస్సాం రైఫిల్ గార్డ్స్ వర్గాలు తెలిపాయి. ఇటీవల మయన్మార్ లో సైనిక ప్రభుత్వం ఆదేశాలను పాటించలేక సుమారు 30 మంది పోలీసులు రహస్యంగా సరిహద్దులు దాటి అస్సాం జిల్లాలోకి ప్రవేశించారు. తమ సైనికాధికారుల సూచనలను పాటించకపోతే తాను తీవ్రంగా శిక్షిస్తారని, ఈ భయంతో తాము భయంతో పరారై వచ్చ్చామని ఆ పోలీసులు అస్సాం అధికారులకు తెలిపారు. ఇక్కడి ప్రభుత్వం తమను శరణార్థులుగా భావించి తమకు ఆశ్రయం కల్పించాలని వారు అభ్యర్థించారు. అయితే వీరి విషయంలో ఏం చేయాలో అస్సాం అధికారులకు తోచలేదు. ఇది కేంద్రానికి, రెండు దేశాలకు సంబంధించినదని వారు డైలమాలో పడ్డారు.
మయన్మార్ లో సైనిక ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. అక్కడ ప్రజానేత ఆంగ్ సాన్ సూకీని సైనికాధికారులు నిర్బంధించి ఏడాది పాటు ఎమర్జెన్సీ విధించారు. పలు దేశాలు మయన్మార్ పై ఆంక్షలు విధించినా వారు వెనక్కి తగ్గలేదు. ఆంగ్ సాన్ సూకీని వెంటనే విడుదల చేయాలనీ, దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుధ్ధరించాలని కోరుతూ వేలాది మంది నిరసనకారులు ప్రదర్శనలు చేస్తున్నారు. వారిని చెదర గొట్టేందుకు పోలీసులు, సైన్యం కాల్పులు జరుపుతుండడంతో ఇటీవల 40 మందికి పైగా ఆందోళనకారులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఆ దేశం నుంచి ఇండియాకు చేరుకుని ఆశ్రయం కోరితే వీరి విషయంలో ఉదారంగా చర్యలు తీసుకున్న పక్షంలో మయన్మార్ తో చిక్కులు కొని తెచ్చుకోవడమే అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్లే పారిపోయి వఛ్చిన 30 మంది పోలీసుల్లో 8 మందిని తక్షణమే తిప్పి పంపివేయాల్సిందిగా హోమ్ శాఖ అస్సాం రైఫిల్స్ దళాలను కోరింది. పైగా వీరిని వెంటనే తమకు అప్పగించాలని ఆ దేశ ప్రభుత్వం కూడా కోరింది. కాగా మిగతా పోలీసుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో నన్న విషయాన్ని కేంద్రం యోచిస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి:
Breaking News: షర్మిల ఆవిష్కరించిన వైఎస్‌ఆర్ విగ్రహం ధ్వంసం.. ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత