AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాను వెనక్కి నెట్టనున్న భారత్.. ప్రపంచంలోనే నెం. 2 మెట్రో నెట్‌వర్క్‌ వైపు.. వేగంగా అడుగులు!

భారతదేశంలో మెట్రో రైలు నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది. రాబోయే రెండేళ్లలో అమెరికాను వెనక్కి నెట్టి చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ కలిగిన దేశంగా భారత్‌ అవతరించనుందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 నగరాల్లో విస్తరించిన మెట్రో మార్గాల మొత్తం పొడవు 1,170 కిలోమీటర్లకు చేరింది.

అమెరికాను వెనక్కి నెట్టనున్న భారత్.. ప్రపంచంలోనే నెం. 2 మెట్రో నెట్‌వర్క్‌ వైపు.. వేగంగా అడుగులు!
India Close To Overtaking Us In Metro Rail Network Length
Sharada V
|

Updated on: Sep 06, 2026 | 8:56 PM

Share

అమెరికాలో మెట్రో రైలు నెట్‌వర్క్‌ సుమారు 1,386 కిలోమీటర్లుగా ఉంది. భారత్‌ ప్రస్తుతం అమెరికా కంటే కేవలం 216 కిలోమీటర్ల దూరంలో మాత్రమే వెనుకబడి ఉంది. సుమారు 8,000 కిలోమీటర్ల మెట్రో మార్గంతో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2014 నాటికి దేశంలో కేవలం 5 నగరాలకే పరిమితమై, 245 కిలోమీటర్లు మాత్రమే ఉన్న మెట్రో నెట్‌వర్క్‌.. గత దశాబ్ద కాలంలో దాదాపు ఐదు రెట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో మరో 1,000 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే రాబోయే రెండేళ్లలో అమెరికాను దాటి భారత్‌ రెండో స్థానాన్ని దక్కించుకోవడం ఖాయమని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేశంలో మెట్రో నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోందని, త్వరలోనే అమెరికాను వెనక్కినెట్టి ప్రపంచంలో రెండో స్థానానికి చేరతామని అన్నారు. గతంలో కొన్ని నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 నగరాలకు విస్తరించినట్లు మంత్రి తెలిపారు.  ప్రధాని నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన నాటికి కేవలం 5 నగరాల్లో మాత్రమే 245 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలు ఉండేవి.  రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త మార్గాలు అందుబాటులోకి రానుండటంతో, దేశంలో మెట్రో నెట్‌వర్క్‌ మరింత వేగంగా వృద్ధి చెందనుందని అన్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 నగరాల్లో సుమారు 1,170 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే దేశ మెట్రో నెట్‌వర్క్‌ దాదాపు ఐదు రెట్లు పెరిగిందని మంత్రి తెలిపారు.  మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయడంతో, కొత్త నగరాల్లో కూడా మెట్రో రైలు ప్రాజెక్టుల పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయనీ అన్నారు.

ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌ కలిగిన దేశంగా ఉంది. చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అమెరికా రెండో స్థానంలో ఉంది. “రాబోయే రెండేళ్లలో అమెరికాను అధిగమించి, చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌ కలిగిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని భావిస్తున్నాను” అని మనోహర్ లాల్ ఖట్టర్ ఆశాభావం వ్యక్తం చేసారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చూడండి

Follow Us
హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..
ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..
బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?
బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?
అమెరికాను నెట్టి.. ప్రపంచంలో నెం. 2 మెట్రో నెట్‌వర్క్ గా భారత్
అమెరికాను నెట్టి.. ప్రపంచంలో నెం. 2 మెట్రో నెట్‌వర్క్ గా భారత్
బిగ్ బాస్ 10 ఐదో కంటెస్టెంట్ అమన్ గురించి ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 ఐదో కంటెస్టెంట్ అమన్ గురించి ఆసక్తికర విషయాలు
280 కి.మీల కఠిన యాత్ర: 12 ఏళ్లకు ఒక్కసారే ఎందుకంటే?
280 కి.మీల కఠిన యాత్ర: 12 ఏళ్లకు ఒక్కసారే ఎందుకంటే?
కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..
కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..
డ్రగ్స్‌ కేసులో టీవీ యాంకర్‌కు మరణశిక్ష!
డ్రగ్స్‌ కేసులో టీవీ యాంకర్‌కు మరణశిక్ష!
మెగాస్టార్ డైరెక్టర్‌తో మోక్షజ్ఞ మూవీ
మెగాస్టార్ డైరెక్టర్‌తో మోక్షజ్ఞ మూవీ
బిగ్‌బాస్ 10 నాలుగో కంటెస్టెంట్‌గా రాయలసీమ కుర్రాడు సుధీర్ రెడ్డి
బిగ్‌బాస్ 10 నాలుగో కంటెస్టెంట్‌గా రాయలసీమ కుర్రాడు సుధీర్ రెడ్డి