AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: ఒకప్పుడు మెడికల్ షాప్‌లో వర్కర్‌.. బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్ స్టార్ కమెడియన్ గ్రాండ్ ఎంట్రీ

చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లు గానే జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. ఇప్పటికే బుల్లితెరపై తన ఆటో పంచులతో ఆకట్టుకున్న రామ్ ప్రసాద్ ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోలో ఏమేర సత్తా చాటుతాడో చూడాలి.

Bigg Boss Telugu 10: ఒకప్పుడు మెడికల్ షాప్‌లో వర్కర్‌.. బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్ స్టార్ కమెడియన్ గ్రాండ్ ఎంట్రీ
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 06, 2026 | 9:20 PM

Share

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ లో భాగంగా ఎప్పటిలాగే హోస్ట్ కింగ్ నాగార్జున అద్దిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. అలాగే హీరో కార్తీ, మరో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ లాంఛింగ్ ఎపిసోడ్ లో సందడి చేశారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ లో మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి దేబ్ జానీ మోదక్ ఎంట్రీ ఇచ్చింది.   ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ గా త్రిగుణ్, మూడో కంటెస్టెంట్ గా సింగర్ ఝాన్సీ, నాలుగో కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి, ఐదో కంటెస్టెంట్ గా అమన్ మసూద్, ఆరో కంటెండర్ గా  నటి చైత్ర రాయ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు . ఇక ఏడో కంటెస్టెంట్ గా జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులతో కలిసి కామెడీ స్కిట్లు వేసి బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు రామ్ ప్రసాద్. ముఖ్యంగా ఆటో పంచులతో బాగా ఫేమస్ అయ్యాడు. అలాంటిది బిగ్ బాస్ షో కోసం జబర్దస్త్ ను వదిలేసి వచ్చాడు రామ్ ప్రసాద్.

ఆటో రామ్ ప్రసాద్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఇతను కనీసం ఇంటర్మీడియెట్ కూడా పూర్తి చేయలేదు. కుటుంబ పోషణ కోసం వైజాగ్ లో ఓ మెడికల్ షాపులో పని చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు దాదాపు ఆరేళ్ల పాటు మెడికల్ షాపులోనే పని చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. ఇదే క్రమంలో నటనపై ఆసక్తి ఉండడంతో తన స్నేహితుడి సాయంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట జబర్దస్త్ లో ఓ సాధారణ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. కేవలం యాక్టింగ్ తోనే కాకుండా తన రైటింగ్ స్కిల్స్ తోనూ సత్తా చాటాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అందుకే జబర్దస్త్ లో టీమ్ లీడర్ దాకా ఎదిగాడు. అలాగే అవకాశమొచ్చినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోనూ అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. మరి జబర్దస్త్ తో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఆటో రామ్ ప్రసాద్ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.

జబర్దస్త్ లో సూపర్ హిట్.. మరి బిగ్ బాస్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..
కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..
జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు ఇలా
జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు ఇలా
తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌
తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌
పాత బెడ్‌షీట్‌తో ఇన్ని ఉపయోగాలా? ఇంట్లో ఇలా రీయూజ్ చేసుకోండి!
పాత బెడ్‌షీట్‌తో ఇన్ని ఉపయోగాలా? ఇంట్లో ఇలా రీయూజ్ చేసుకోండి!
బిగ్‌బాస్ 10 ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. అసలు ఎవరీమే?
బిగ్‌బాస్ 10 ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. అసలు ఎవరీమే?
తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..
ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..
బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?
బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?
అమెరికాను నెట్టి.. ప్రపంచంలో నెం. 2 మెట్రో నెట్‌వర్క్ గా భారత్
అమెరికాను నెట్టి.. ప్రపంచంలో నెం. 2 మెట్రో నెట్‌వర్క్ గా భారత్