AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ స్టేజ్ పైకి.. హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా

బిగ్ బాస్ సీజన్ 10 మొదలైపోయింది. సీజన్  10 ప్రారంభం అయ్యింది. ఈ సీజన్  మరింత ఆసక్తికరంగా ఉండనుంది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ కొత్త సీజన్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగులో విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం అట్టహాసంగా ముస్తాబైంది

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ స్టేజ్ పైకి.. హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన  చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
Chaitra Rai
Rajeev Rayala
|

Updated on: Sep 06, 2026 | 9:04 PM

Share

కన్నడ నాటకు చెందిన చైత్ర రాయ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ముఖ్యంగా సీరియల్స్ చూసే ప్రేక్షకుల్లో చాలా మందికి ఈ నటి ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. అష్టాచమ్మా సీరియల్‌తో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకుంది చైత్ర రాయ్. అందులో ఆమె అభినయం అందరినీ కట్టి పడేసింది. అత్తో అత్తమ్మ కూతురో, దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు వంటి పలు సూపర్ హిట్ సీరియల్స్‌లోనూ నటించింది చైత్ర.

సీరియల్స్ తో పాటు అప్పుడప్పుడూ సినిమాల్లో కనిపించే చైత్ర ఆ మధ్యన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ దేవరలో ఓ కీలక పాత్రలో నటించింది. దేవరలో విలన్ సైఫ్ అలీ ఖాన్ భార్యగా కనిపించిన చైత్ర తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కూర్గ్ లో జన్మించిన ఈ చిన్నది. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. ఆతర్వాత సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటించింది. ఇటీవలే ఈ అమ్మడు పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన కామెంట్ ఎంతగానో బాధపెట్టిందని. దాంతో మూడు నెలల్లోనే బరువు తగ్గి చూపించా అని తెలిపింది చైత్ర

అలాగే 10నెలల బాబును విడిచి ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. తాను ఎమోషనల్ అని తొందరగా అందరికి కనెక్ట్ అవుతా అని చెప్పింది. కన్నడ పరిశ్రమలో అనేక సీరియల్స్ ద్వారా నటిగా గుర్తింపు తెచ్చుకుంది చైత్ర. ఇప్పుడు సినిమాలు, సీరియల్స్ లో అలరిస్తుంది. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. మరి ఈ అమ్మడు హౌస్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..
ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..
బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?
బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?
అమెరికాను నెట్టి.. ప్రపంచంలో నెం. 2 మెట్రో నెట్‌వర్క్ గా భారత్
అమెరికాను నెట్టి.. ప్రపంచంలో నెం. 2 మెట్రో నెట్‌వర్క్ గా భారత్
బిగ్ బాస్ 10 ఐదో కంటెస్టెంట్ అమన్ గురించి ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 ఐదో కంటెస్టెంట్ అమన్ గురించి ఆసక్తికర విషయాలు
280 కి.మీల కఠిన యాత్ర: 12 ఏళ్లకు ఒక్కసారే ఎందుకంటే?
280 కి.మీల కఠిన యాత్ర: 12 ఏళ్లకు ఒక్కసారే ఎందుకంటే?
కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..
కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..
డ్రగ్స్‌ కేసులో టీవీ యాంకర్‌కు మరణశిక్ష!
డ్రగ్స్‌ కేసులో టీవీ యాంకర్‌కు మరణశిక్ష!
మెగాస్టార్ డైరెక్టర్‌తో మోక్షజ్ఞ మూవీ
మెగాస్టార్ డైరెక్టర్‌తో మోక్షజ్ఞ మూవీ
బిగ్‌బాస్ 10 నాలుగో కంటెస్టెంట్‌గా రాయలసీమ కుర్రాడు సుధీర్ రెడ్డి
బిగ్‌బాస్ 10 నాలుగో కంటెస్టెంట్‌గా రాయలసీమ కుర్రాడు సుధీర్ రెడ్డి