AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

Hyderabad: ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసి, వీలైనంత త్వరగా చార్జిషీట్‌ దాఖలు చేయాలని సీఎం ఆదేశించారు. నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందించేందుకు కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారించేలా..

Hyderabad: తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Cm Revanth Reddy
Subhash Goud
|

Updated on: Sep 06, 2026 | 9:14 PM

Share

Tukkuguda Nurse Murder Case: తుక్కుగూడలో నర్సును దారుణంగా చంపేశాడో కిరాతకుడు. హాస్పిటల్‌ రూంలో స్నేహితురాలితో కలిసి ఉంటున్న యువతి ప్రాణాలు తీశాడో రాక్షసుడు. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో రూమ్‌‌‌‌లోకి ప్రవేశించిన సనా వుల్లాఖాన్‌ అత్యాచారానికి యత్నించాడు. ప్రతిఘటించడంతో ఇనుప రాడ్‌‌‌‌తో ముఖంపై బాదాడు. బాధితురాలు కేకలు వేయడంతో విషయం బయటకు వస్తుందనే భయంతో గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

నర్సు నివాసం ఉన్న హాస్టల్‌ వద్ద భద్రతా ఏర్పాట్లపై కూడా విచారణ జరపాలని రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రత విషయంలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా? నిబంధనలు పాటించారా? అనే అంశాలను పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసి, వీలైనంత త్వరగా చార్జిషీట్‌ దాఖలు చేయాలని సీఎం ఆదేశించారు. నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందించేందుకు కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పాత బెడ్‌షీట్‌తో ఇన్ని ఉపయోగాలా? ఇంట్లో ఇలా రీయూజ్ చేసుకోండి!
పాత బెడ్‌షీట్‌తో ఇన్ని ఉపయోగాలా? ఇంట్లో ఇలా రీయూజ్ చేసుకోండి!
బిగ్‌బాస్ 10 ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. అసలు ఎవరీమే?
బిగ్‌బాస్ 10 ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. అసలు ఎవరీమే?
తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..
ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..
బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?
బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?
అమెరికాను నెట్టి.. ప్రపంచంలో నెం. 2 మెట్రో నెట్‌వర్క్ గా భారత్
అమెరికాను నెట్టి.. ప్రపంచంలో నెం. 2 మెట్రో నెట్‌వర్క్ గా భారత్
బిగ్ బాస్ 10 ఐదో కంటెస్టెంట్ అమన్ గురించి ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 ఐదో కంటెస్టెంట్ అమన్ గురించి ఆసక్తికర విషయాలు
280 కి.మీల కఠిన యాత్ర: 12 ఏళ్లకు ఒక్కసారే ఎందుకంటే?
280 కి.మీల కఠిన యాత్ర: 12 ఏళ్లకు ఒక్కసారే ఎందుకంటే?
కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..
కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..