AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఏమవుతుందనే నిర్లక్ష్యం.. ఏకంగా ఓ యువకుడి జీవితాన్నే బలితీసుకుంది!

కుక్క కాటు చిన్న విషయమే అనుకున్నారు. గాయం తగ్గిపోయిందని టీకా అవసరం లేదనుకున్నారు. కానీ మూడు నెలల తర్వాత ఆ నిర్లక్షమే ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. కుక్క కరిచిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో సకాలంలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోలేదు. చివరకు రేబిస్ లక్షణాలు బయటపడటంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయారు.

Telangana: ఏమవుతుందనే నిర్లక్ష్యం.. ఏకంగా ఓ యువకుడి జీవితాన్నే బలితీసుకుంది!
Medak Man Dies After Neglecting Dog Bite
P Shivteja
| Edited By: |

Updated on: Sep 06, 2026 | 3:32 PM

Share

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం తుపాకులపల్లిలో జరిగిన ఈ విషాద ఘటన వెలుగు చూసింది. కుక్క కాటును నిర్లక్ష్యం చేయడం ఓ యువకుడి ప్రాణాన్నే తీసింది. వివరాల్లోకి వెళ్తే.. పరికిబండ మధిర గ్రామ పరిధిలోని తుపాకులపల్లికి చెందిన కాష్ రాములు, లలిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సురేశ్ ఉన్నారు. ఇతను పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే సురేష్ ఓ రోజు జీడిపల్లిలో పాలు పోసి బైక్‌పై తిరిగి వస్తుండగా ఓ కుక్క అతన్ను కరిచింది. అయితే ఈ విషయాన్ని సురేశ్ ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. వైద్యులను కూడా సంప్రదించకుండా, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. కాలక్రమేణా ఆ గాయం కూడా తగ్గిపోయింది.

అలాగే దాదాపు 3 నెలలు గడిచి పోయింది.. గాయం కూడా తగ్గిపోయింది. కానీ ప్రమాదం మాత్రం అక్కడితో ముగియలేదు. కొన్ని రోజుల తర్వాత సురేశ్‌లో అనారోగ్య లక్షణాలు కనిపించడం ప్రారంభమైంది. ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. ఆ తర్వాత సురేశ్ ప్రవర్తనలో కూడా మార్పులు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. చివరకు హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం సురేశ్ మృతిచెందాడు. దీంతో సురేష్‌ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సరైన సమయంలో చికిత్స తీసుకుని ఉంటే సురేష్ హ్యాపీగా తన ఫ్యామిలీతో కలిసి జీవనం సాగించేవాడు. కానీ ఆ చిన్న నిర్లక్ష్యం ఇప్పుడు అతన్ని తిరిగి రాలి లోకాలకు తీసుకెళ్లింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us