AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో సోమవారం వెదర్ రిపోర్ట్

అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం. ఏపీలో గంటకు 30–50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో సోమవారం వెదర్ రిపోర్ట్
Weather Alert
Shaik Madar Saheb
|

Updated on: Sep 06, 2026 | 6:24 PM

Share

అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ వర్షాలు, వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి , దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీనపడింది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో ఇవాళ, సోమవారం, మంగళవారం.. వరకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం : –

ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి , తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ;-

ఆదివారం సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.

రాయలసీమ:-

ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

తెలంగాణలో వర్షాలు..

ఇక తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం, సోమవారం ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మేడ్చల్‌, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతేకాకుండా.. తెలంగాణలోని మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. జీహెచ్‌ఎంసీ పరిధిలో మోస్తరు వర్షం కురుస్తుందని పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
బిగ్ బాస్ 10కు నాగార్జున ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
బిగ్ బాస్ 10కు నాగార్జున ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్
సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్
ఏడాదిలో అత్యంత శుభయోగం.. ఈ 4 రాశుల వారికి ఇక అదృష్టమే అదృష్టం!
ఏడాదిలో అత్యంత శుభయోగం.. ఈ 4 రాశుల వారికి ఇక అదృష్టమే అదృష్టం!
నువ్వు నాకు నచ్చావ్’ 'సినిమా రిలీజై 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?
నువ్వు నాకు నచ్చావ్’ 'సినిమా రిలీజై 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?
ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ తర్వాత అంతటి క్రేజ్..
ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ తర్వాత అంతటి క్రేజ్..
ఢిల్లీలో కూలిన భవనం.. శిథిలాల కింద సుమారు చాలా మంది విద్యార్థులు!
ఢిల్లీలో కూలిన భవనం.. శిథిలాల కింద సుమారు చాలా మంది విద్యార్థులు!
మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్.. వేలాది మందికి డ్రగ్స్..
మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్.. వేలాది మందికి డ్రగ్స్..
బిగ్ బాస్ తెలుగు 10.. స్టేజీపైనే జబర్దస్త్ కమెడియన్‌కు బిగ్‌ షాక్
బిగ్ బాస్ తెలుగు 10.. స్టేజీపైనే జబర్దస్త్ కమెడియన్‌కు బిగ్‌ షాక్
విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసారు!
విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసారు!