AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేట్ భాగాలను దొంగిలించారనే ఆరోపణలతో ఆఫ్రికాలో 80 మంది హత్య!

ప్రైవేట్ భాగాలను మాయం చేశారనే వదంతులను నమ్మి అకారణంగా అనుమానాలు పెంచుకుని ఆఫ్రికా దేశాలైన టాంజానియా, ఉగాండాలో కొద్ది నెలల వ్యవధిలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. ఒకరు మరొకరి భుజం పై చేయి వేసినా షేక్ హ్యండ్ ఇచ్చినా  అవతలి వారి పురుషాంగాలు మాయం అవుతాయనే నమ్మకం ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు, అల్లర్లకు దారితీసింది. పది నెలల కాలంలో 80 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

ప్రైవేట్ భాగాలను దొంగిలించారనే ఆరోపణలతో ఆఫ్రికాలో 80 మంది హత్య!
80 Murders In 10 Months Over Rumours Of Stealing Of Private Parts In African Countries
Sharada V
|

Updated on: Sep 06, 2026 | 4:41 PM

Share

ఆఫ్రికాలో అంతుచిక్కని మూఢనమ్మకాలు అమాయకుల ప్రాణాలను బలిగొన్నాయి. కొత్త వారితో చేయి కలిపితే జననాంగాలు మాయమవుతాయనే వింత వదంతుల కారణంగా 10 నెలల కాలంలోనే 80 మందికి పైగా మూకహింసకు బలయ్యారు. ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ ఈ విచిత్ర వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (డీఆర్‌సీ), బురుండీ, జాంబియా, టాంజానియా, మొజాంబిక్, అంగోలా, మలావి, కెన్యా దేశాల్లో ఈ వదంతులు తీవ్రంగా ప్రబలాయి.  ఇది కుట్రనా లేక కేవలం వదంతా? ఆఫ్రికా దేశాలలో నిజంగా ఏం జరుగుతోంది?  

ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న వింత వదంతులు

కొత్త వ్యక్తులకు షేక్‌హ్యాండ్ ఇస్తే తమ వృషణాలు, జననేంద్రియాలు  కుచించుకుపోతున్నట్లు అక్కడి పురుషులు భ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించిన  వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తమ శరీర భాగాలు మాయం చేశారంటూ అనుమానితులను చుట్టుముడుతున్న స్థానిక మూకలు, వారిని దారుణంగా కొట్టి చంపుతూ ఆ భాగాలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాయ

టాంజానియాలో దారుణ ఘటన జరిగింది. బోనిఫేస్ మగాలా అనే కార్ మెకానిక్, తన స్నేహితుడితో కలిసి ఒక హోటల్‌లో కూర్చుని భోజనం చేస్తున్నాడు. అకస్మాత్తుగా ఒక గుంపు అక్కడికి దూసుకొచ్చి, వారిద్దరినీ బయటకు ఈడ్చుకెళ్లి “మీరు ప్రైవేట్ భాగాలను దొంగిలించారు” అని ఆరోపించింది. వారు ఎంతగా కొట్టారంటే, మగాలా స్నేహితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన మగాలా రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాడు.

అక్టోబర్ 2025 నుండి జూలై 2026 మధ్య సుమారు 10 నెలల కాలంలో, ప్రైవేట్ భాగాలను దొంగిలించారనే ఆరోపణలతో 6 ఆఫ్రికా దేశాలలో 80 మందికి పైగా హత్య చేయబడ్డారు.  ఈ హత్యల వెనుక ఒకే రకమైన పద్ధతి కనిపిస్తోంది. గుంపుగా చేరిన మూక ఒక అపరిచితుడిని చుట్టుముట్టి కొట్టి చంపుతుంది. ఆ అపరిచితుడు తమ వ్యక్తిని భుజంపై తేలికగా తట్టాడని లేదా అతనిని తాకడం వల్లనే అతని ప్రైవేట్ భాగాలు కుచించుకుపోయాయని లేదా మాయమయ్యాయని ఆరోపించి ఈ దాడులకు పాల్పడుతున్నారు.

అధికారుల పరిశోధన ప్రకారం ఇవి పూర్తిగా నిరాధారమైన వదంతులు, మూఢనమ్మకాలే అని తేలింది. అయితే, వీటి వెనుక ఏదైనా సామాజిక కుట్ర ఉందా లేదా అనే కోణంలోనూ అధికారులు విచారణ జరుపుతున్నారు.  జననేంద్రియాలు లోపలకు ముడుచుకుపోతున్నాయనే భ్రమతో  ‘కోరో సిండ్రోమ్‌’ అనే మానసిక రుగ్మత వల్లే ఈ అపోహలు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు, వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Follow Us
ప్రైవేట్ భాగాలను దొంగిలించారనే ఆరోపణలతో ఆఫ్రికాలో 80 మంది హత్య!
ప్రైవేట్ భాగాలను దొంగిలించారనే ఆరోపణలతో ఆఫ్రికాలో 80 మంది హత్య!
ధర తక్కువ.. సౌండ్ ఎక్కువ.. సౌత్‌టెక్‌ స్పీకర్ స్పెషాలిటీస్ ఇవే
ధర తక్కువ.. సౌండ్ ఎక్కువ.. సౌత్‌టెక్‌ స్పీకర్ స్పెషాలిటీస్ ఇవే
ఓటీటీలో దుమ్మురేపుతోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో దుమ్మురేపుతోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
పితృ పక్షం ఎప్పుడు? శ్రాద్ధం, తర్పణం చేసేటప్పుడు దక్షిణం వైపే..
పితృ పక్షం ఎప్పుడు? శ్రాద్ధం, తర్పణం చేసేటప్పుడు దక్షిణం వైపే..
ఆంధ్ర స్టైల్ స్పెషల్ చికెన్ కర్రీ.. ఇదొక్కటి వేస్తే నీచు వాసనరాదు
ఆంధ్ర స్టైల్ స్పెషల్ చికెన్ కర్రీ.. ఇదొక్కటి వేస్తే నీచు వాసనరాదు
ఆడియన్స్ గెట్ రెడీ..
ఆడియన్స్ గెట్ రెడీ..
కెమెరా, ఫీచర్లతో పిచ్చెక్కిస్తున్న పోకో.. పూర్తి వివరాలివే
కెమెరా, ఫీచర్లతో పిచ్చెక్కిస్తున్న పోకో.. పూర్తి వివరాలివే
టూత్‌బ్రష్‌లో 150 మెగా పిక్సెల్స్‌ కెమెరా! సీక్రెట్‌ తెలుసా
టూత్‌బ్రష్‌లో 150 మెగా పిక్సెల్స్‌ కెమెరా! సీక్రెట్‌ తెలుసా
3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు రూ.3 వేలు.. అకౌంట్లో జమ..!
3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు రూ.3 వేలు.. అకౌంట్లో జమ..!
గ్లోబల్ మార్కెట్‌లో పోకో X8 స్మార్ట్‌ఫోన్ ఫీవర్‌‌! ఏంటో స్పెషల్
గ్లోబల్ మార్కెట్‌లో పోకో X8 స్మార్ట్‌ఫోన్ ఫీవర్‌‌! ఏంటో స్పెషల్