AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 1 గంట 56 నిమిషాల మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే టాప్‌లో ట్రెండింగ్

సస్పెన్స్, క్రైమ్, యాక్షన్, ఎమోషన్స్.. ఇలా ఆడియెన్స్ కు నచ్చే ఎన్నో ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఓటీటీలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ సినిమా నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌ అవుతోంది. వీకెండ్ లో మంచి సినిమా చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

OTT Movie: 1 గంట 56 నిమిషాల మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే టాప్‌లో ట్రెండింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 06, 2026 | 4:37 PM

Share

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నటించిన లేటేస్ట్ యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ ‘గాంధారి’. ఈ మూవీసెప్టెంబర్ 3న డైరెక్టుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోన్న ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ జాబితాలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ‘గాంధారి’ కథ ఒక తల్లి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను బాని అనే తల్లి పాత్రను పోషించింది. తన కూతురు అపహరణకు గురైన తర్వాత, ఆమెను కనుగొనడానికి ఎంతకైనా తెగిస్తుంది. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో ప్రమాదకరమైన అడ్డంకులను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ, తన కూతురిని తిరిగి పొందాలనే ఆమె దృఢ సంకల్పం, ప్రతి అడ్డంకిని అధిగమించే శక్తిని ఆమెకు ఇస్తుంది. ఈ సినిమా కథ కేవలం యాక్షన్ ప్రధానంగానే కాకుండా, ఒక తల్లి పడే భావోద్వేగ సంఘర్షణను ఆవిష్కరిస్తుంది. తన బిడ్డ భద్రత పట్ల తల్లికి ఉండే భయం, ఆ బిడ్డ కోసం ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి ఆమె సిద్ధంగా ఉండటమే ఈ చిత్రంలో భావోద్వేగపరంగా ప్రధానాంశం.

‘గాంధారి’ చిత్రంలో తాప్సీ పన్ను మరోసారి యాక్షన్ పాత్రలో కనిపించనుంది. బాని పాత్ర శారీరకంగా చాలా సవాలుతో కూడుకున్నదని చిత్ర నిర్మాతలు కూడా తెలిపారు. ‘గాంధారి’ చిత్రానికి కనికా ధిల్లాన్ రచన, నిర్మాణం చేయగా, దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించారు. ఇది తాప్సీ, కనికల కాంబినేషన్ లో వచ్చిన మూడో సూపర్ హిట్ సినిమా. గతంలో వీరిద్దరూ ‘హసీన్ దిల్‌రూబా’, ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా’ వంటి సూపర్ హిట్ ప్రాజెక్టులలో కలిసి పనిచేశారు. ఈ చిత్రంలో తాప్సీతో పాటు ఇష్వాక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తిక ముఖర్జీ, మీతా వశిష్ట్, జతిన్ సర్నా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా, మరాఠీ నటి ఛాయా కదమ్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆమె నటనతో పాటు, ఆ పాత్ర కోసం ఆమె చేసిన సన్నాహాలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో గాంధారి..

గాంధారి సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, ఇంగ్లీష్ తదితర భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. వీకెండ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకునేవారికి ‘గాంధారి’ సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

గాంధారి సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us