AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రీస్‌లో విషాదం: ఎయిర్ షోలో యుద్ధ విమానం కుప్పకూలి.. ఇద్దరు పైలట్లు మృతి!

గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో జరిగిన ఎయిర్ షోలో వేలాది మంది ప్రేకకుల కళ్లెదుటే F-4 యుద్ధ విమానం కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోగా, భారీ ఎత్తున దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. ఊహించని సంఘటనకు తనగ్రా ఎయిర్ షో ను  వీక్షిస్తున్న వేలాది మంది సందర్శకులు షాకయ్యారు. శనివారం మధ్యాహ్నం ఎయర్ షో ఒక్కసారిగా విషాదంగా మారింది.

గ్రీస్‌లో విషాదం: ఎయిర్ షోలో యుద్ధ విమానం కుప్పకూలి.. ఇద్దరు పైలట్లు మృతి!
Two Pilots Killed In Greece Air Show Tragedy
Sharada V
|

Updated on: Sep 06, 2026 | 6:50 PM

Share

వేలాది మంది ప్రేక్షకులు వీక్షిస్తున్న ‘ఏథెన్స్ ఫ్లయింగ్ వీక్ 2026’ వైమానిక ప్రదర్శనలో ఎఫ్-4 ఫాంటమ్ (F-4 Phantom) యుద్ధ విమానం పాల్గొంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, అతి తక్కువ ఎత్తులో విన్యాసాలు చేస్తుండగా ఈ జెట్ విమానం అకస్మాత్తుగా అదుపుతప్పి కిందికి పడిపోవడం ప్రారంభమైంది. విమానం వేగంగా కిందకు దూసుకొచ్చి నేలను ఢీకొట్టి పేలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది  ఘటనా స్థలానికి చేరుకున్నారు.  అధికారులు అప్రమత్తమై ఎయిర్ షోను వెంటనే నిలిపివేసి  ప్రేక్షకులను ఆ ప్రాంతం నుంచి తరలించారు.

సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 2:55 గంటల ప్రాంతంలో ఏథెన్స్‌కు ఉత్తరాన తనగ్రా సమీపంలో ఈ విమానం కూలిపోయింది.  ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సిబ్బందిని 40 ఏళ్ల మేజర్ లావోన్నిస్ బ్లీసియాస్, 37 ఏళ్ల కెప్టెన్ డిమిట్రియోస్ పెట్రోలుగా గ్రీకు వైమానిక దళం గుర్తించింది. వీరుద్దరూ గ్రీకు ఎయిర్ ఫోర్స్‌కు చెందినవారు.  వైమానిక ప్రదర్శనలో భాగంగా ఎఫ్-4ఈ ఫాంటమ్ యుద్ధ విమానాన్ని నడుపుతూ ప్రమాదానికి గురయ్యారు.

ప్రదర్శన మొదలైన కొద్ది నిమిషాలకే, విమానం చాలా తక్కువ ఎత్తులో విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం అకస్మాత్తుగా అదుపుతప్పి నేలపై కూలిపోయింది. ఈ పెద్ద ప్రమాదం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

పారిశ్రామిక ప్రాంతంలో విమానం కూలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.  ప్రమాదంపై విచారణ జరిపేందుకు గ్రీకు వైమానిక దళం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. యుద్ధ విమానం ఒక్కసారిగా అంత వేగంగా ఎత్తు ఎందుకు కోల్పోయింది అనే దానిపై దర్యాప్తు అధికారులు విమాన శకలాలు, అందుబాటులో ఉన్న వీడియో ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.

Follow Us
ఎయిర్ షోలో కుప్పకూలిన F-4 యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి!
ఎయిర్ షోలో కుప్పకూలిన F-4 యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి!
టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్.. 3 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం
టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్.. 3 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం
ఇంట్లో చక్కెరను ఇలా పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్థిక సమస్య
ఇంట్లో చక్కెరను ఇలా పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్థిక సమస్య
కొత్త బాలెనో కేవలం రూ. 6.10 లక్షలకే.. అద్భుతమైన డిజైన్‌, ఫీచర్స్
కొత్త బాలెనో కేవలం రూ. 6.10 లక్షలకే.. అద్భుతమైన డిజైన్‌, ఫీచర్స్
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
బిగ్ బాస్ 10కు నాగార్జున ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
బిగ్ బాస్ 10కు నాగార్జున ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్
సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్
ఏడాదిలో అత్యంత శుభయోగం.. ఈ 4 రాశుల వారికి ఇక అదృష్టమే అదృష్టం!
ఏడాదిలో అత్యంత శుభయోగం.. ఈ 4 రాశుల వారికి ఇక అదృష్టమే అదృష్టం!
నువ్వు నాకు నచ్చావ్’ 'సినిమా రిలీజై 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?
నువ్వు నాకు నచ్చావ్’ 'సినిమా రిలీజై 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?
ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ తర్వాత అంతటి క్రేజ్..
ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ తర్వాత అంతటి క్రేజ్..