AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసిన సిబ్బంది!

టెక్సాస్‌లోని డల్లాస్-ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూజెర్సీలోని నెవార్క్ కు ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర హంగామా సృష్టించాడు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరిన రెండు గంటల తర్వాత ప్రయాణికులంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో, అకస్మాత్తుగా ఆ వ్యక్తి పక్క సీటులో కూర్చున్న ప్రయాణికుడిపై ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే దాడికి దిగాడు. 

విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసిన సిబ్బంది!
Man Duct Taped To Seat On Flight After Alleged Racist Outburst
Sharada V
|

Updated on: Sep 06, 2026 | 5:28 PM

Share

జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన ఒక నల్లజాతి విమాన సిబ్బందిని ఉద్దేశించి  జాతి వివక్షను సూచించే పదజాలంతో దూషించాడు.  ఆ తర్వాత ఈ వివాదం కాస్తా భౌతిక దాడికి దారితీసింది. సదరు వ్యక్తి తన పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికుడిపై దాడి చేసి, అతని కంప్యూటర్‌ను ధ్వంసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. సహాయం చేయడానికి ప్రయత్నించిన ఒక మహిళను కూడా అతను తోసేసినట్లు సమాచారం.

విమానంలో పరిస్థితి మరింత తీవ్రం కావడంతో, తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విమానంలో గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న రిచర్డ్ ఓలెనిక్, జువాన్ మెజియా అనే మాజీ పోలీసు అధికారులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రయాణికుడు గొడవ చేయకుండా, సీటు నుంచి కదలకుండా విమాన సిబ్బందితో కలిసి అతడి శరీరం, చేతుల చుట్టూ గట్టిగా డక్ట్ టేప్ చుట్టి కట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.  అతని చేతులను జిప్ టైస్‌తో కట్టేసి, ఆ తర్వాత అతను సీటు నుంచి కదలకుండా డక్ట్ టేప్‌తో గట్టిగా బిగించి కట్టేశారు. 

ఈ ఘటనతో అప్రమత్తమైన పైలట్లు, అత్యవసరంగా విమానాన్ని మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి  నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విమానం తిరిగి బయలుదేరి గమ్యస్థానమైన నెవార్క్‌కు చేరుకుంది.

సదరు వ్యక్తిని 67 ఏళ్ల అరిజోనా వాసి ఆర్థర్ లూండీన్‌గా గుర్తించారు. మేరీల్యాండ్‌లోని  అరుండెల్ కౌంటీలో సెకండ్ డిగ్రీ అసాల్ట్ (దాడి కేసు), అల్లకల్లోలం సృష్టించడం (డిజార్డర్లీ కండక్ట్) కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన తర్వాతి రోజు సెప్టెంబర్ 4న లూండీన్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అక్టోబర్ 19వ తేదీన మరోసారి న్యాయస్థానం ఎదుట హాజరుకావాల్సి ఉంది.

విమానంలో ప్రయాణికుడిని టేప్‌తో కట్టేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  విమానంలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. గాల్లో ఉండగా ప్రయాణికుల నుంచి ఇటువంటి హింసాత్మక ఘటనలు ఎదురుకావడం విమాన భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోందని అభిప్రాయపడ్డారు.

మరో వైపు, కస్టమర్ల భద్రతకే ప్రాధాన్యత ఇస్తామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. విమానాల్లో హింసాత్మక ప్రవర్తనను, భద్రతకు భంగం కలిగించే చర్యలను ఏ మాత్రం సహించబోమని ఎయిర్‌లైన్స్ యాజమాన్యం తేల్చిచెప్పింది.

Follow Us
ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ తర్వాత అంతటి క్రేజ్..
ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ తర్వాత అంతటి క్రేజ్..
ఢిల్లీలో కూలిన భవనం.. శిథిలాల కింద సుమారు చాలా మంది విద్యార్థులు!
ఢిల్లీలో కూలిన భవనం.. శిథిలాల కింద సుమారు చాలా మంది విద్యార్థులు!
మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్.. వేలాది మందికి డ్రగ్స్..
మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్.. వేలాది మందికి డ్రగ్స్..
బిగ్ బాస్ తెలుగు 10.. స్టేజీపైనే జబర్దస్త్ కమెడియన్‌కు బిగ్‌ షాక్
బిగ్ బాస్ తెలుగు 10.. స్టేజీపైనే జబర్దస్త్ కమెడియన్‌కు బిగ్‌ షాక్
విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసారు!
విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసారు!
బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా?
బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా?
పిచ్చెక్కించే సూపర్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఈవీ
పిచ్చెక్కించే సూపర్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఈవీ
ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా..? సంపద నిలవకపోవడానికి ఇవే కారణమని..
ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా..? సంపద నిలవకపోవడానికి ఇవే కారణమని..
మెటాలిక్​ గ్రే స్ట్రాప్‌తో బోట్‌ స్మార్ట్‌వాచ్‌.. స్పెషాలిటీ ఇదే
మెటాలిక్​ గ్రే స్ట్రాప్‌తో బోట్‌ స్మార్ట్‌వాచ్‌.. స్పెషాలిటీ ఇదే
యాపిల్ మాజీ సీఈవో నికర ఆస్తి విలువ ఎంత? ఇక ఆయన కొత్త రోల్ ఏంటి?
యాపిల్ మాజీ సీఈవో నికర ఆస్తి విలువ ఎంత? ఇక ఆయన కొత్త రోల్ ఏంటి?