AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా ? ఎవరికి జారీ చేస్తారు?

Credit Card: క్రెడిట్ కార్డును బాగా ఆలోచించి, జాగ్రత్తగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఎంత ఖర్చు చేస్తారో, దాని బిల్ సైకిల్ సమయానికి తిరిగి చెల్లించాలి. సరిగ్గా ఉపయోగిస్తే క్రెడిట్ కార్డు అవసరమైన సమయంలో మిమ్మల్ని ఆదుకుంటుంది. క్రెడిట్ కార్డు..

Credit Card: బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా ? ఎవరికి జారీ చేస్తారు?
Credit Card
Subhash Goud
|

Updated on: Sep 06, 2026 | 5:12 PM

Share

Credit Card Eligibility: సార్/ మేడం మేం పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు క్రెడిట్ కార్డ్ ఏమైనా కావాలా అని వారి రిప్రజెంటెటివ్స్ అడుగుతుంటారు. అయితే క్రెడిట్ కార్డు తీసుకోవడానికి బ్యాంకులో అకౌంట్ ఉండటం అవసరమా? అంటే తప్పనిసరిగా అదే బ్యాంకులో అకౌంట్ ఉన్న వ్యక్తికే క్రెడిట్ కార్డు ఇవ్వాలనే రూల్ ఉండదు. పలు బ్యాంకులు తమ వద్ద బ్యాంక్ అకౌంట్ లేని వారికి కూడా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుంటాయి.

నిపుణుల ప్రకారం, బ్యాంకులు ముందుగా దరఖాస్తుదారుడి ఆదాయం ఎంత, వారు ఏ పని చేస్తారు, క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది. సమయానికి బిల్ పేమెంట్ చేయగలరా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఈ విషయాల్లో క్లారిటీ వస్తే చాలు బ్యాంక్ అకౌంట్ లేకుండానే కూడా ఆ వ్యక్తికి క్రెడిట్ కార్డు జారీ చేస్తారు.

ఇది కూడా చదవండి: Tim Cook Net Worth: యాపిల్ మాజీ సీఈవో నికర ఆస్తి విలువ ఎంత? యాపిల్ నుంచి తప్పుకున్నాక ఆయన కొత్త రోల్ ఏంటి?

ఎఫ్‌డీని చూసి క్రెడిట్ కార్డు జారీ

కొన్నిసార్లు ఒక వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు. దాంతో వారికి క్రెడిట్ హిస్టరీ కూడా ఉండదు. అలాంటి సందర్భాల్లో కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీ(FD)కి బదులుగా కూడా క్రెడిట్ కార్డు జారీ చేస్తాయి. దీని ద్వారా ప్రజలకు మంచి క్రెడిట్ హిస్టరీ క్రియేట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంటే వ్యక్తికి క్రెడిట్ కార్డు వస్తుంది. అక్కడి నుంచి ఆ వ్యక్తికి క్రెడిట్ హిస్టరీ ప్రారంభమవుతుంది.

క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ

క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, మీ ఆదాయానికి సంబంధించిన కొన్ని అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అయితే ప్రతి బ్యాంక్‌కు వారికంటూ వేర్వేరు రూల్స్, కండీషన్స్ ఉంటాయని గుర్తుంచుకోండి. చాలాసార్లు ప్రీపెయిడ్ కార్డు, క్రెడిట్ కార్డుకు ప్రత్యామ్నాయం అని ప్రజల్లో అపోహ ఉంటుంది. కానీ అందులో నిజం కాదు. ప్రీపెయిడ్ కార్డులో మీరు మీ డబ్బును ముందుగానే లోడ్ చేసి ఖర్చు చేస్తారు.

క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డుకు మధ్య వ్యత్యాసం ఏమిటి?

క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు 2 వేర్వేరు రకాల కార్డులు అని గ్రహించాలి. బిల్లులు సకాలంలో చెల్లిస్తూ క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగిస్తే మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడవచ్చు. అయితే ప్రీపెయిడ్ కార్డు వినియోగం క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. ప్రీపెయిడ్ కార్డు అంటే ముందుగానే మనీ జమ చేసే కార్డు. వినియోగదారు కార్డులో ఉన్న మొత్తాన్ని తమ అవసరాలకు తగ్గట్లుగా ఖర్చు చేయవచ్చు. క్రెడిట్ కార్డును మీ వద్ద నగదు లేకపోయినా అందులో ఉన్న లిమిట్ వరకు షాపింగ్ చేయవచ్చు. బిల్లులు పే చేసే వీలుంటుంది. అందువల్ల ప్రీపెయిడ్ కార్డును క్రెడిట్ కార్డుగా భావించవద్దు.

క్రెడిట్ కార్డుతో జాగ్రత్త

క్రెడిట్ కార్డును బాగా ఆలోచించి, జాగ్రత్తగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఎంత ఖర్చు చేస్తారో, దాని బిల్ సైకిల్ సమయానికి తిరిగి చెల్లించాలి. సరిగ్గా ఉపయోగిస్తే క్రెడిట్ కార్డు అవసరమైన సమయంలో మిమ్మల్ని ఆదుకుంటుంది. క్రెడిట్ కార్డు తీసుకునే ముందు దాని వడ్డీ రేటు, వార్షిక ఫీజు, లేట్ ఫీజుతో పాటు ఇతర అన్ని ఛార్జీల గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Business Ideas: 14 ఏళ్ల IT కెరీర్ వదిలి వ్యవసాయంలోకి.. వీటి సాగుతో నెలకు రూ.10 లక్షల ఆదాయం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా?
బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా?
పిచ్చెక్కించే సూపర్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఈవీ
పిచ్చెక్కించే సూపర్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఈవీ
ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా..? సంపద నిలవకపోవడానికి ఇవే కారణమని..
ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా..? సంపద నిలవకపోవడానికి ఇవే కారణమని..
మెటాలిక్​ గ్రే స్ట్రాప్‌తో బోట్‌ స్మార్ట్‌వాచ్‌.. స్పెషాలిటీ ఇదే
మెటాలిక్​ గ్రే స్ట్రాప్‌తో బోట్‌ స్మార్ట్‌వాచ్‌.. స్పెషాలిటీ ఇదే
యాపిల్ మాజీ సీఈవో నికర ఆస్తి విలువ ఎంత? ఇక ఆయన కొత్త రోల్ ఏంటి?
యాపిల్ మాజీ సీఈవో నికర ఆస్తి విలువ ఎంత? ఇక ఆయన కొత్త రోల్ ఏంటి?
ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ
ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ
స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లే సూపర్ అంటే.. ధర ఇంత తక్కువా
స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లే సూపర్ అంటే.. ధర ఇంత తక్కువా
చిల్లర మాటలు.. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన: కేసీఆర్
చిల్లర మాటలు.. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన: కేసీఆర్
కప్ టీమిండియా గెలిచినా.. పట్టుకెళ్లేది మాత్రం పాకిస్థానోడే!
కప్ టీమిండియా గెలిచినా.. పట్టుకెళ్లేది మాత్రం పాకిస్థానోడే!
ప్రైవేట్ భాగాలను దొంగిలించారనే ఆరోపణలతో ఆఫ్రికాలో 80 మంది హత్య!
ప్రైవేట్ భాగాలను దొంగిలించారనే ఆరోపణలతో ఆఫ్రికాలో 80 మంది హత్య!