Rajesh Agrawal: లండన్‌లో భారత సంతతి వ్యక్తికి మరో అవకాశం.. డిప్యూటీ మేయర్ ఫర్ బిజినెస్‌గా పారిశ్రామికవేత్త రాజేష్

|

May 14, 2021 | 12:01 PM

భారత సంతతికి చెందిన వ్యక్తికి లండన్‌లో మరోసారి గొప్ప గౌరవం దక్కింది. భారతదేశంలో జన్మించిన పారిశ్రామికవేత్త రాజేష్ అగర్వాల్ లండన్ డిప్యూటీ మేయర్ ఫర్ బిజినెస్‌గా తిరిగి నియమితులయ్యారు.

Rajesh Agrawal: లండన్‌లో భారత సంతతి వ్యక్తికి మరో అవకాశం.. డిప్యూటీ మేయర్ ఫర్ బిజినెస్‌గా పారిశ్రామికవేత్త రాజేష్
London's Deputy Mayor For Business Rajesh Agarwal
Follow us on

London’s Deputy Mayor for Business: భారత సంతతికి చెందిన వ్యక్తికి లండన్‌లో మరోసారి గొప్ప గౌరవం దక్కింది. భారతదేశంలో జన్మించిన పారిశ్రామికవేత్త రాజేష్ అగర్వాల్ లండన్ డిప్యూటీ మేయర్ ఫర్ బిజినెస్‌గా తిరిగి నియమితులయ్యారు. గ‌త వారం జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో గెలిచి వ‌రుస‌గా రెండోసారి లండ‌న్ మేయ‌ర్‌గా ఎన్నికైన సాదిక్ ఖాన్‌.. రాజేష్ అగ‌ర్వాల్‌కు తాజాగా కీల‌క బాధ్యత‌లు అప్పగించారు.

కాగా, మ‌ధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన రాజేష్ లండన్‌లో స్థిరపడ్డారు. పారిశ్రామికవేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఈ బాధ్యత‌లు చేప‌ట్టడం రాజేష్‌కు ఇది వ‌రుస‌గా రెండోసారి. ఇక త‌న‌కు ఈ ప‌ద‌వి ద‌క్కడం ప‌ట్ల రాజేష్ సంతోషం వ్యక్తం చేశారు. దీనికి కార‌ణ‌మైన లండ‌న్ ప్రజ‌ల‌కు ఆయ‌న ప్రత్యేక ధ‌న్యవాదాలు తెలియ‌జేశారు. గ‌డిచిన ఐదేళ్లు ఇదే ప‌దవిలో లండ‌న్ వాసుల‌కు తాను చేసిన సేవ‌ల‌ను ఈ సంద‌ర్భంగా రాజేష్ గుర్తు చేసుకున్నారు. మ‌హ‌మ్మారి క‌ల్లోలం వేళ త‌లెత్తిన ఆరోగ్య, ఆర్థిక స‌మ‌స్యల‌ను తాము అధిగ‌మించిన తీరు అమోఘం అని పేర్కొన్నారు. త‌న‌పై న‌మ్మకంతో రెండోసారి ఈ బాధ్యత‌లు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.


కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక, సామాజిక అసమానతలను తీవ్రతరం అయ్యాయి. ముఖ్యంగా యువత, మహిళలు, మైనారిటీల ప్రజలు మహమ్మారితో అసమానంగా దెబ్బతిన్నారు. ఈ సంక్షోభం నుండి బయటపడటానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ‘ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు మొదటి ప్రాధాన్యతనని రాజేష్ పేర్కొన్నారు.

ప్రతిపక్ష లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి ఆయన విజయం సాధించారు. అంతేకాదు లేబర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా (ఎల్ఎఫ్ఐఎన్) డయాస్పోరా ప్రతినిధి బృందానికి కో-చైర్మన్‌గా కూడా అయిన అగర్వాల్ 2001 లో లండన్ చేరుకున్నారు. ఒక చిన్న విదేశీ మారకద్రవ్యం, డబ్బు బదిలీ సంస్థను స్థాపించి, బహుళ మిలియన్లుగా అభివృద్ధి చేశారు.

Read Also…  Hospital Beds: ఒక్క ఫోన్ కాల్‌తో హైదరాబాద్‌లో హాస్పిటల్ బెడ్స్ జాడ తెలుసుకోండిలా.. వివరాలివే..