లద్ధాఖ్‌లో ఎగరనున్న శాంతికపోతం.. బలగాల ఉపసంహరణకు భారత్, చైనా నిర్ణయం!

తూర్పు లద్ధాఖ్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తెర పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో భారత్, చైనా కీలక నిర్ణయం

లద్ధాఖ్‌లో ఎగరనున్న శాంతికపోతం.. బలగాల ఉపసంహరణకు భారత్, చైనా నిర్ణయం!
Eastern Ladakh

తూర్పు లద్ధాఖ్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తెర పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో భారత్, చైనా కీలక నిర్ణయం తీసుకున్నాయి. సహరిద్దుల్లోని ఘర్షణాత్మక ప్రాంతాల్లో మొహరించిన ఇరు దేశాల బలగాలను ఉపసంహరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్టు సమాచారం.  ఇటీవల భారత్, చైనా మధ్య జరిగిన 12వ విడత చర్చల్లో సరిహద్దుల్లోని తూర్పు లద్ధాఖ్‌లో మొహరించిన సైనిక బలగాల ఉపసంహరణపై ఇరుదేశాలు చర్చించాయి. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇరు పక్షాలు ఎలాంటి దాపరికాలు లేకుండా తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. ఈ సమావేశాల ఫలితంగా తూర్పు లద్ధాఖ్ సరిహద్దుల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్టు సమాచారం. గతంలో అరునెల్ల క్రితం పాంగంగ్ లేక్ ప్రాంతంలో బలగాల ఉపసంహరణలో భారత్, చైనాల మధ్య ఏకాభిప్రాయం కుదింది. తాజాగా తూర్పు లద్ధాఖ్ సరిహద్దుల్లో బలగాహల ఉపసహరణ నిర్ణయం త్వరలో అమల్లోకి రానున్నట్టు సమాచారం.

 

Click on your DTH Provider to Add TV9 Telugu