Petrol Price Hike Impact: ఆ ప్రాంతంలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.70.. క్యూ కడుతున్న జనం

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టేశాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని చోట్ల తమ బైక్స్ ను పక్కకు పెట్టి.. ప్రయాణానికి ప్రత్యాన్మాయ మార్గాలను ఎంచుకుంటున్నారు తాజాగా మనదేశంలోని...

Petrol Price Hike Impact: ఆ ప్రాంతంలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.70.. క్యూ కడుతున్న జనం
Follow us

|

Updated on: Feb 24, 2021 | 11:24 AM

Petrol Price Hike Impact: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టేశాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని చోట్ల తమ బైక్స్ ను పక్కకు పెట్టి.. ప్రయాణానికి ప్రత్యాన్మాయ మార్గాలను ఎంచుకుంటున్నారు తాజాగా మనదేశంలోని కొంతమంది ఆ దేశానికి క్యూ కడుతున్నారు ఎందుకంటే అక్కడ లీటరు పెట్రోల్ కేవలం రూ. 70లు ఇక డీజిల్ రూ. 59 మాత్రమే..

భారత్ సరిహద్దు దేశమైన నేపాల్ లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగాఉన్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఉండే గ్రామస్థులు అక్కడకు వెళ్లి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే స్మగ్లింగ్ కూడా చేస్తున్నారు. కొంతమంది ఖాళీవాహనాలను తీసుకుని వెళ్లి.. ఫుల్ ట్యాంక్ లను కొట్టించుకుని వస్తున్నారు.

మనదేశంలో పెట్రోల్‌ రూ. 100 దగ్గరలో ఉంది. డీజిల్‌ రూ.90 వద్ద ఉంది. ఇది ప్రతి వాహనదారుడిపై తీవ్రప్రభావం చూపుతోంది. నేపాల్‌ కరెన్సీ భారత రూపాయితో పోల్చుకుంటే పెట్రోల్‌ ధర మనకు లీటరు రూ.70, డీజిల్‌ రూ.59 కే వస్తుంది. అంటే లీటరుకు రూ.30 వ్యత్యాసం ఉంది. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఉండేవారు అక్కడికి పెట్రోల్ కోసం క్యూ కడుతున్నారు. దీంతో ఈ విషయం నేపాల్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వారికి తెలిసింది. దీంతో నేపాల్‌ కొత్త రూల్స్‌ అమల్లోకి తెచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్‌ బంకుల్లో తనిఖీ నిర్వహిస్తోంది. బ్లాక్‌ మార్కెటింగ్‌ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటోంది. కొంత మంది వారి వాహనాల్లో పెట్రోట్, డీజిల్‌ లేకుండా వెళ్లి ఫుల్‌ ట్యాంకు కొట్టించుకోని మళ్లీ ఇండియాకు తిరిగి వస్తున్నారని అక్కడి నివేదికలు తెలుపుతున్నాయి. ఒక నేపాల్‌ రూపీ మన కరెన్సీలో 62 పైసలకు సమానం.

Also Read:

పంజాబ్ పాఠశాలల్లో కరోనా కలకలం.. 13 మందికి పాజిటివ్… మరో 48 గంటలపాటు స్కూల్స్ మూసివేత