Imrankhan Statement: సొంతింట్లో దిక్కు లేదు కానీ కశ్మీర్‌ కావాలట.. ఆర్టికల్ 370ని రీవోక్ చేస్తేనే భారత్ చర్చలన్న ఇమ్రాన్

సొంత దేశంలో స్థిరత్వం లేదు.. తన పదవి వుంటుందో ఊడుతుందో తెలియదు.. దేశంలో ఎప్పుడు సైనిక తిరుగుబాటు జరుగుతుందో అంతకన్నా తెలియదు.. న్యాయస్థానాలు తనను ఎప్పుడు పదవీచ్యుతున్ని చేస్తాయో తెలియదు. కానీ.. పాకిస్తాన్...

Imrankhan Statement: సొంతింట్లో దిక్కు లేదు కానీ కశ్మీర్‌ కావాలట.. ఆర్టికల్ 370ని రీవోక్ చేస్తేనే భారత్ చర్చలన్న ఇమ్రాన్
Imran Khan

Imrankhan Statement on Jammu Kashmir: సొంత దేశంలో స్థిరత్వం లేదు.. తన పదవి వుంటుందో ఊడుతుందో తెలియదు.. దేశంలో ఎప్పుడు సైనిక తిరుగుబాటు (MILITARY REVOLUTION) జరుగుతుందో అంతకన్నా తెలియదు.. న్యాయస్థానాలు తనను ఎప్పుడు పదవీచ్యుతున్ని చేస్తాయో తెలియదు. కానీ.. పాకిస్తాన్ ప్రధాని (PAKISTAN PRIME MINISTER) ఇమ్రాన్ ఖాన్‌ (IMRAN KHAN)కు మన దేశ అంతర్గత విషయాలపై మాత్రం ఆశ చావడం లేదు. తాజాగా జమ్ము కశ్మీర్ (JAMMU KASHMIR) స్వయం ప్రతిపత్తి (AUTONOMOUS)పై మరోసారి మాట్లాడాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆర్టికల్ 370 (ARTICLE 370)ని తిరిగి అమల్లోకి తీసుకొచ్చి.. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి పునరుద్ధరిస్తేనే తాను భారత్‌తో చర్చలకు ముందుకొస్తానంటూ అసమయమూ, సందర్భమూ లేని ప్రకటనొకటి చేసి పారేశాడు ఇమ్రాన్ ఖాన్.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఉపసంహరించుకునే దాకా చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అంటున్నాడు. ‘జమ్మూకశ్మీర్‌ ఐక్యరాజ్యసమితి ఎజెండాలో ఉంది. దీనిపై భద్రతా మండలి పలు తీర్మానాలు కూడా చేసింది. అందుకే కశ్మీర్‌ భారత్‌ అంతర్గత అంశం కాదు’ అని ఇమ్రాన్ ఖాన్ మే 12న పాక్ మీడియాకు ముందు వాపోయాడు. భారత రాజ్యాంగం (INDIAN CONSTITUENCY)లోని ఆర్టికల్‌ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత ప్రభుత్వం 2019లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2019 ఆగస్టు 5వ తేదీన నరేంద్ర మోదీ ప్రభుత్వం (NARENDRA MODI GOVERNMENT) 70 ఏళ్ళ దాష్టీకంగా మారిన ఆర్టికల్ 370 ని చారిత్రాత్మక నిర్ణయంతో రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. లద్దాక్ (LADDAKH), కశ్మీర్ (KASHMIR) వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిన తర్వాత కశ్మీర్ అసెంబ్లీ కలిగిన యుటీ (UT) గాను.. లద్ధాక్.. అసెంబ్లీ లేని యుటీ (UNION TERRITORY)గా ప్రశాంత వాతావరణం దిశగా అడుగులు వేస్తున్నాయి.

కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణానికి కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT) తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కశ్మీరీ యువతను ఉగ్రవాదం (TERRORISM)వైపు మరల కుండా చర్యలు తీసుకుంటోంది. వారికి ఉద్యోగ, ఉపాధి కల్పనకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అటు సుందర లద్ధాక్‌ను పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కశ్మీరీలకు తమది భారతేనన్న ఓ నమ్మకం కలుగుతున్న తరుణంలో పాక్ కుటిల యత్నాలు గతంలో పారడం లేదు. ఈ క్రమంలోనే కశ్మీరీలను మరోసారి రెచ్చ గొట్టే దిశగా పాక్ సైన్యం ప్రేరేపిస్తున్న ఉగ్రవాద సంస్థలు కృషి ప్రారంభించాయి. ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో భారత్‌పై ప్రెషర్ పెట్టలేకపోతోందని పాక్ ఆర్మీ (PAK ARMY) భావిస్తోంది. అందుకే గత మూడు, నాలుగునెలలుగా పాకిస్తాన్ సైనిక తిరుగుబాటు దిశగా వెళుతుందన్న కథనాలు పెరిగాయి. అదే సమయంలో పలు కోర్టు కేసులను ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్‌ను పదవీచ్యుతున్ని చేసేందుకు న్యాయస్థానాలు (PAKISTAN COURTS) చూస్తున్నాయి. ఈ క్రమంలో తన ప్రధాని పదవి వుంటుందో ఊడుతుందో తెలియని సందిగ్ధంలో ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత అంతర్గత విషయాలపై విరుచుకుపడుతున్నారని విదేశీ వ్యవహారాల నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంటున్న వ్యాక్సినేషన్.. తెలుగు రాష్ట్రాల్లో 1.29 కోట్ల డోసుల పంపిణీ

ALSO READ: మళ్ళీ కుదేలవుతున్న విమానయాన రంగం.. సెకెండ్ వేవ్ దెబ్బకు ఢమాల్

ALSO READ: ఆందోళన కలిగిస్తున్న పాజిటివిటీ రేటు.. తాజా గణాంకాలతో అందరిలో షాక్