Imran Khan arrest: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఇమ్రాన్ అరెస్ట్ చట్టవిరుద్దమని , వెంటనే విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అయినప్పటికీ శుక్రవారం(మే 12) ఇస్లామాబాద్ హైకోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు పోలీసు గెస్ట్‌హౌస్‌లో ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ భవితవ్యం తేలనుంది. దేశంలో తాను హింసను కోరుకోవడం లేదని, ఎన్నికలు కోరుకుంటున్నానని ఇమ్రాన్ అన్నారు. అలాగే తన విచారణలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ పాక్ రేంజర్లు తనను హింసించారని ఆరోపించారు. తన పార్టీ కార్యకర్తలు హింసకు పాల్పడడంపై సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పారు. అల్‌ఖదీర్ ట్రస్ట్ నిధుల గోల్‌మాల్ కేసులో ఇమ్రాన్‌ను పాక్ NAB రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Pakistan: Supreme Court orders Imran Khan’s immediate release after calling his arrest “illegal”
ఇవి కూడా చదవండిRead @ANI Story | https://t.co/upzv2Mvxxg#imran_Khan #PTI #Pakistan #imranKhanPTI pic.twitter.com/lBMNVdf9JJ
— ANI Digital (@ani_digital) May 11, 2023
మరోవైపు ఇస్లామాబాద్ హైకోర్టులో జరిగిన ఘర్షణలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ రేంజర్లు కోర్టు మర్యాదకు భంగం కలిగించారని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు మర్యాదను కాపాడడానికి తాము కీలక ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించింది. కోర్టులో ఓ మాజీ ప్రధానిని ఎలా అరెస్ట్ చేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అధ్యక్షుడు అల్వీ కూడా ఇమ్రాన్ అరెస్ట్‌ను తప్పుపట్టారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో అరాచకం రాజ్యమేలుతోందని మండిపడ్డారు.
ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై పాక్ సుప్రీంకోర్టు తీర్పుపై అధికార పీఎంఎల్‌ఎన్ నేత మరియం షరీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చీఫ్‌జస్టిస్ వెంటనే ఇమ్రాన్ పార్టీలో చేరితే బాగుంటుందన్నారు. దేశాన్ని దోచుకున్న వ్యక్తిని సుప్రీంకోర్టు విడుదల చేసిందని మండిపడ్డారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..