Covid-19: కరోనా పీడ ఇప్పట్లో పోయేది కాదు.. దశాబ్దాలపాటు వెంటాడుతుంది: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

|

Feb 08, 2022 | 4:48 AM

Impact of Covid-19: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి రెండేళ్ల పట్టిపీడిస్తోంది. కరోనావైరస్ తీవ్రత ఇప్పుడిప్పుడే తగ్గుతుందన్న క్రమంలో కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

Covid-19: కరోనా పీడ ఇప్పట్లో పోయేది కాదు.. దశాబ్దాలపాటు వెంటాడుతుంది: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
WHO
Follow us on

Impact of Covid-19: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి రెండేళ్ల పట్టిపీడిస్తోంది. కరోనావైరస్ తీవ్రత ఇప్పుడిప్పుడే తగ్గుతుందన్న క్రమంలో కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ.. పలు దేశాల్లో కరోనా (Coronavirus) కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా పీడ నుంచి ఎప్పుడు బయటపడతామా అంటూ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ (WHO) తాజాగా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనమ్‌ (Tedros Adhanom Ghebreyesus) సోమవారం మాట్లాడారు.

కరోనా వైరస్ ఎంత సుదీర్ఘంగా ప్రబలితే దాని ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఆ మహమ్మారి మిగిల్చిన చేదు అనుభవాలను ప్రపంచ దేశాలు కొన్ని దశాబ్దాలపాటు మర్చిపోలేవని స్పష్టంచేశారు. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా (Covid-19) వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉండే గ్రూపుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందంటూ అని టెడ్రోస్‌ అథనమ్ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి ఉన్నంతకాలం చేదు అనుభవాలు వెంటాడే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ అసమానతల గురించి డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కామన్వెల్త్‌ దేశాల్లో కేవలం 42 శాతం మంది మాత్రమే రెండు డోసుల టీకా పొందగలిగారని.. ఇంకా సగానికిపైగా టీకా తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్‌ రేటు కేవలం 23శాతం మాత్రమే ఉందన్నారు. టీకా పంపిణీలో వ్యత్యాసం చాలా ఉందని.. దీనిని పూడ్చి అందరికీ వ్యాక్సిన్‌ అందించడమే తమ సంస్థ తక్షణ కర్తవ్యం అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనమ్ పేర్కొన్నారు.

Also Read:

Corona Vaccine: రోజుకో రూపాన్ని సంతరించుకుంటున్న కరోనాకు భారత శాస్త్రవేత్తలు చెక్.. అన్ని వేరియంట్స్‌కు ఒకే టీకా అబివృద్ధి..

Booster Shot: బూస్టర్ డోస్‌ తీసుకున్న తర్వాత చాలామందిలో ఈ సైడ్‌ ఎఫెక్ట్‌.. ఎందుకంటే..?