India – Pakistan: ఐ లవ్‌ పాకిస్తాన్‌.. యుద్ధం ఆపిన ఘనత నాదే.. మరోసారి ట్రంప్‌ యూటర్న్‌..

భారత్‌- పాక్‌ మధ్య ట్రంప్‌ జోక్యంపై అనుమానాల నేపథ్యంలోనే ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐ లవ్‌ పాకిస్తాన్‌ అని కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశం అవుతోంది. పాకిస్తాన్‌ వైపు నుంచి జోక్యంతోనే యుద్ధం ఆగిందన్నారు ట్రంప్‌. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపిన ఘనత తనదేనని చెప్పుకొచ్చారు. అదేసమయంలో.. మోదీ అద్భుతమై వ్యక్తి అంటూ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు.

India - Pakistan: ఐ లవ్‌ పాకిస్తాన్‌.. యుద్ధం ఆపిన ఘనత నాదే.. మరోసారి ట్రంప్‌ యూటర్న్‌..
Donald Trump, Pm Modi

Updated on: Jun 19, 2025 | 9:18 AM

భారత్‌-పాక్‌ మధ్య యుద్ధం ఆపింది నేనే అంటూ పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట మార్చారు. భారత్‌ వైపు నుంచి మోదీ, పాకిస్తాన్‌ వైపు తాను యుద్దం ఆపినట్టు ఈ వ్యవహారంపై యూటర్న్‌ తీసుకున్నారు. భారత్‌- పాక్‌ మధ్య ట్రంప్‌ జోక్యంపై అనుమానాల నేపథ్యంలోనే ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐ లవ్‌ పాకిస్తాన్‌ అని కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశం అవుతోంది. పాకిస్తాన్‌ వైపు నుంచి జోక్యంతోనే యుద్ధం ఆగిందన్నారు ట్రంప్‌. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపిన ఘనత తనదేనని చెప్పుకొచ్చారు. అదేసమయంలో.. మోదీ అద్భుతమై వ్యక్తి అంటూ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. ఆయనతో నిన్ననే ట్రేడ్‌ డీల్‌పై ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

మీ జోక్యాన్ని ఎవ్వరూ అడగలేదు: ప్రధాని మోదీ..

అంతకుముందు జీ-7 సమావేశాల తరువాత ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడిన మోదీ మీ జోక్యాన్ని ఎవ్వరూ అడగలేదంటూ తేల్చిచెప్పారు. ఆపరేషన్‌ సింధూర్‌పై ట్రంప్‌ తీరును ఎండగట్టారు మోదీ. ట్రంప్‌ మధ్యవర్తిత్వం ప్రకటనను తిరస్కరించారు. కశ్మీర్‌పై పాక్‌తోనే నేరుగా చర్చలు ఉంటాయని, ఇతర దేశాల జోక్యం అవసరం లేదన్నారు. జీ-7 సమావేశాల తరువాత అమెరికా రావాలన్న ట్రంప్‌ ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించారు. బిజీ షెడ్యూల్‌ కారణంగా రాలేకపోతున్నట్టు తెలిపారు. వాస్తవానికి ఈ విషయాన్ని మోదీ నేరుగా ట్రంప్‌కే చెప్పాల్సి ఉంది. కానీ కెనడాలో ఇద్దరు నేతల సమావేశం జరగలేదు. కానీ ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్‌- హుటాహుటిన అమెరికాకు బయల్దేరారు. మోదీని కలుసుకోలేకపోయిన ట్రంప్‌, ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్లు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రి వివరించారు.

భారత్‌- పాక్‌ మధ్య ట్రంప్‌ జోక్యంపై అనుమానాల నేపథ్యంలోనే ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐ లవ్‌ పాకిస్తాన్‌ అని కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశం అవుతోంది. పాకిస్తాన్‌ వైపు నుంచి జోక్యంతోనే యుద్ధం ఆగిందన్నారు ట్రంప్‌. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపిన ఘనత తనదేనని చెప్పుకొచ్చారు. అదేసమయంలో.. మోదీ అద్భుతమై వ్యక్తి అంటూ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. ఆయనతో నిన్ననే ట్రేడ్‌ డీల్‌పై ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

ట్రంప్‌- మోదీ ఫోన్‌కాల్‌పై కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ ఏమన్నారంటే..

ట్రంప్‌- మోదీ ఫోన్‌కాల్‌పై కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ విమర్శలు గుప్పించారు. భారత విదేశాంగ విధానానికి, దౌత్యానికి ట్రిపుల్‌ జట్కా తగిలిందన్నారు. పాక్‌ ఫీల్డ్‌ మార్షల్‌ మునీర్‌ను ట్రంప్ లంచ్‌కు పిలవడం భారత దౌత్యానికి ఎదురుదెబ్బ అన్నారాయన. భారత్‌- పాక్‌ మధ్య తాను మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్‌‌ 14 సార్లు చెప్పినా మోదీ మౌనంగానే ఉన్నారంటూ జైరామ్ రమేష్‌ ప్రశ్నించారు. నెల రోజుల తరువాత మోదీకి ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు.

అయితే జైరాం రమేశ్‌ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. ట్రంప్‌ మధ్యవర్తిత్వం ప్రకటనపై ప్రధాని మోదీ పూర్తి క్లారిటీ ఇచ్చారని, అయినప్పటికి కాంగ్రెస్‌ విమర్శలు చేయడం మూర్ఖత్వమని విమర్శించింది. ట్రంప్‌ ముఖం మీదే మోదీ వాస్తవాలు చెప్పినప్పటికి కాంగ్రెస్‌ నేతలు ఇలా మాట్లాడడం దారుణమని మండిపడ్డారు బీజేపీ నేతలు..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..