జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ స్పేస్ రాకెట్ టీమ్ లో తానూ సభ్యురాలైనందుకు మహారాష్ట్రకు చెందిన యువతి సంజాల్ గవాండే పొంగిపోతోంది. ఈ నెల 20 న సైట్ సీయింగ్ ట్రిప్ కోసం ఈ రాకెట్ అంతరిక్షానికి ఎగయ నుంది. కాగా మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ళ యువ ఇంజనీర్ సంజాల్ గవాండే ఈ స్పేస్ రాకెట్ రూప కల్పనలో ఇతర ఇంజనీర్లతో బాటు నేను కూడా కృషి చేసినందుకు గర్విస్తున్నా అని పేర్కొంది. తను చిన్నప్పుడు కన్న కలలు నిజమయ్యాయని ఆమె తెలిపింది. పైలట్ లైసెన్స్ పొందిన అనంతరం ఈమె నాసాలో పోస్టు కోసం దరఖాస్తు చేసినప్పటికీ పౌరసత్వ సమస్య కారణంగా దాన్ని నాసా తిరస్కరించింది.కానీ ఈమె పట్టు విడవకుండా జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ లో సిస్టమ్స్ ఇంజనీరుగా గత ఏప్రిల్ లో చేరగలిగింది. ముంబై యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరుగా పట్టా తీసుకున్న ఈమె 2011 లో అమెరికా వెళ్ళింది.
అక్కడే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. నాకు ఈ మిషన్ లో ఇదొక అద్భుత అవకాశం అని గవాండే పేర్కొంది. అటు-జెఫ్ బెజోస్ తో బాటు మరో ఇద్దరు కూడా ఈ రాకెట్ లో అంతరిక్ష యానం చేయనున్నారు. ఈ రాకెట్ మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వెస్ట్ టెక్సాస్ లోని మారుమూల.. ఓ ఎడారి ప్రాంతంలో గల లాంచ్ సైట్ నుంచి నింగికి ఎగయబోతోంది. ఇటీవలే గుంటూరు జిల్లాకు చెందిన 34 ఏళ్ళ యువతి శిరీష బండ్ల కూడా బ్రిటన్ కు చెందిన బిలియనీర్ రిచర్డ్ బ్రాన్ సన్ తో కలిసి వర్జిన్ గెలాక్టిన్ రాకెట్ లో అంతరిక్ష యానం చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి : Anushka Shetty Video:స్వీటీ మూవీ పై గుసగుసలు.. అనుష్క సినిమా ఆగిపోయిందా..(వీడియో).
హైదరాబాద్ లో ఆశర్యం..!బాబోయ్…సమాధి కింద శవం..! పదేళ్లయినా చెక్కుచెదరని శరీరం..:Hyderabad.
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గ్రేట్ గుడ్ న్యూస్.. వచ్చే రెండేళ్లపాటు రిమోట్ పని..:Knowlodge Video.