Hyderabad to Chicago Flight: హైదరాబాద్ నుంచి నేరుగా చికాగో వెళ్ళడానికి విమానం రెడీ..

|

Jan 14, 2021 | 2:35 PM

తాజాగా హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా షికాగో వెళ్లేందుకు అధికారులు మార్గం సుగమం...

Hyderabad to Chicago Flight: హైదరాబాద్ నుంచి నేరుగా చికాగో వెళ్ళడానికి విమానం రెడీ..
Follow us on

Hyderabad to Chicago Flight: కరోనా వైరస్ నివారణ కోసం దేశవిదేశాలు లాక్ డౌన్ బాట పట్టాయి. తమ దేశ సరిహద్దులను మూసివేయడమే కాదు.. విమాన ప్రయాణాలపై కూడా ఆంక్షలను విధించారు. తాజాగా మళ్ళీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా షికాగో వెళ్లేందుకు అధికారులు మార్గం సుగమం చేశారు. ఎయిర్‌ ఇండియా నాన్‌స్టాప్‌ విమానం రేపటి నుంచి ప్రారంభం కానుంది. షికాగో నుంచి బుధవారం బయల్దేరిన ఎయిర్‌ ఇండియా బోయింగ్‌–777 విమానం ఈ రోజు రాత్రి 12.50 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది.

ఇదే విమానం రేపు మధ్యాహ్నం 12.50 గంటలకు ఇక్కడి నుంచి టేకాఫ్‌ అయి నేరుగా షికాగో బయల్దేరుతుందని ఎయిర్‌ ఇండియా వర్గాలు తెలిపాయి. ఇక నుంచి ప్రతి శుక్రవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి షికాగోకు ఈ సర్వీసు వెళ్లనుంది. 238 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో 8 మొదటి తరగతి, 35 బిజినెస్‌ క్లాస్, 195 ఎకానమీ క్లాస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు.

Also Read: చంచల్ గూడ మహిళా జైలుకు తరలించే ముందు అఖిల ప్రియకు కరోనా టెస్టుల నిర్వహణ