China Reports Covid-19 :కరోనాకు పుట్టినిల్లు చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న వైరస్… 8నెలలు తర్వాత ఒకరు మృతి

కరోనా వైరస్ పుట్టినిల్లు అయినా చైనాలో మళ్ళీ వ్యాధి తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ఆ దేశ ప్రభుత్వం కఠిన చర్యలే చేపడుతుంది. ఇప్పటికే మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్,..

China Reports Covid-19 :కరోనాకు పుట్టినిల్లు చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న వైరస్... 8నెలలు తర్వాత ఒకరు మృతి
Follow us
Surya Kala

|

Updated on: Jan 14, 2021 | 4:38 PM

China Reports Covid-19 : కరోనా వైరస్ పుట్టినిల్లు అయినా చైనాలో మళ్ళీ వ్యాధి తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ఆ దేశ ప్రభుత్వం కఠిన చర్యలే చేపడుతుంది. ఇప్పటికే మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్, ఎమర్జెన్సీలను ప్రకటిస్తున్నారు. భారీ సంఖ్యలో కోవిడ్ 19 నిర్ధారణ టెస్టులను నిర్వహిస్తున్నారు. ఓవైపు మేము కరోనా ను సమర్ధవంతగా కట్టడి చేశామని చెబుతున్నా అక్కడ పరిస్థితులను చూస్తుంటే.. మళ్ళీ అసాధారణ స్థితికి చేరుకుంటుంది అని కొంత మంది భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా లో 8 నెలల తర్వాత మళ్ళీ తొలి మరణం నమోదయ్యింది. ఒక్కరోజే 138కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ ప్రకటించింది.

2020 మార్చి తర్వాత ఇన్ని కేసులు నమోదు కావడం కూడా ఇదే తొలిసారని.. బాధితుల్లో ఒకరు మరణించారని అధికారులు తెలిపారు. ‌ అయితే మృతికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం తెలపలేదు. ఇప్పటికే లాక్‌డౌన్‌ అమలులో ఉన్న హెబి ప్రావిన్సులో తాజాగా కొవిడ్‌ మరణం చోటు చేసుకుందని మాత్రమే ప్రకటించింది.

గత కొన్ని రోజులుగా హెబీ ప్రావిన్సుతో పాటు షిజియాజువాంగ్‌ ప్రావిన్సుల్లో వైరస్‌ విస్తృతి పెరిగింది. దీంతో ఆ రెండు ప్రావిన్సుల్లో అధిక జనాభా నివశించే జింగ్‌టాయ్‌, లాంగ్‌ఫాంగ్‌ వంటి నగరాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు.

మరోవైపు కరోనా వైరస్‌ మూలాలను పరిశోధించడంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల బృందం వుహాన్‌ నగరానికి చేరుకుంది. పది మంది నిపుణులతో కూడా ఈ బృందానికి పీటర్‌ బెన్‌ ఎంబారెక్‌ నేతృత్వం వహిస్తున్నారు. అక్కడ వైరస్‌ తీవ్రత మళ్లీ పెరగడంతో ఈ బృందం రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నట్లు దర్యాప్తు బృందం వెల్లడించింది. అయితే కరోనా వైరస్ తీసుకుంటున్న రూపాలతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముందుగా వ్యాధి తీవ్రతను చెప్పకుండా తమను తమ ప్రజలను ఇబ్బంది పెట్టిన చైనా పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.

Also Read:సంక్రాంతి పండగక్కి మీ అభిరుచి అద్దం పట్టేలా ఇంటి అలంకరణలో సింపుల్ చిట్కాలు