Akhila Priya Covid Test: చంచల్ గూడ మహిళా జైలుకు తరలించే ముందు అఖిల ప్రియకు కరోనా టెస్టుల నిర్వహణ
హైదరాబాద్ లోని బోయినపల్లి కి చెందిన ప్రవీణ్ రావు సోదరుల కిడ్నప్ కేసులు అరెస్టైన ఏపీ మాజీమంత్రి భూమా అఖిల ప్రియకు ప్రభుత్వం కోవిడ్ టెస్టులను..

Akhila Priya Covid Test: హైదరాబాద్ లోని బోయినపల్లి కి చెందిన ప్రవీణ్ రావు సోదరుల కిడ్నప్ కేసులు అరెస్టైన ఏపీ మాజీమంత్రి భూమా అఖిల ప్రియకు ప్రభుత్వం కోవిడ్ టెస్టులను నిర్వహించింది. ఇప్పటికే అఖిల ప్రియ ను పోలీసులు మూడు రోజులపాటు విచారించారు. కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఈ నెల 11 నుంచి 12 వరకూ ఆమెను పలు అంశాలపై విచారించారు. ఈ విచారణలో ఆమె నోరు విప్పి పలు సంచలన విషయాలను బయట పెట్టినట్లు తెలుస్తోంది. ఆమెను మూడు రోజుల్లో 300 ప్రశ్నలు అడిగిన పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. ఆమె రికార్డ్ ను నమోదు చేసుకున్న పోలీసులు కస్టడీ ముగియడంతో చంచల్ గుడ మహిళా జైలుకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం బేగం పేట లోని పీహెచ్ సీ లో కోవిడ్ 19 టెస్టులు చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు మూగిన అనంతరం అఖిల ప్రియను పోలీసులు కోర్టు లో హాజరు పరచనున్నారు.
Also Read: స్పానిష్ ఫ్లూ, సార్స్, మెర్స్ ల్లానే కరోనా వైరస్ కూడా సాధారణ జలుబుగానే మారనుందా ..