AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అమెరికాలోని స్టోర్‌లో దొంగతనం.. ఇద్దరు తెలుగు విద్యార్థినిలు అరెస్ట్

అమెరికాలోని న్యూజెర్సీలో చదువుతున్న 20, 22 ఏళ్ల ఇద్దరు భారతీయ విద్యార్థులు ఓ దుకాణంలో చోరీకి పాల్పడిన కేసులో అరెస్టయ్యారు. షాప్‌రైట్ స్టోర్.. పోలీసులను అప్రమత్తం చేయడంతో ఇద్దరు తెలుగు అమ్మాయిలను అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి...

Watch: అమెరికాలోని స్టోర్‌లో దొంగతనం.. ఇద్దరు తెలుగు విద్యార్థినిలు అరెస్ట్
Telugu Students
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 19, 2024 | 12:25 PM

Share

గత నెలలో గ్రాసరీ స్టోర్‌లో  దొంగతనానికి పాల్పడ్డారనే ఆరోపణలతో తెలంగాణలోని హైదరాబాద్,  ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థినిలను  అమెరికాలో అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన 20 ఏళ్ల యువతి, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన 22 ఏళ్ల మరో యువతి స్టీవెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించడానికి USలోని న్యూజెర్సీకి వెళ్లారు. హాబోకెన్ షాప్‌రైట్ అనే గ్రాసరీ స్టోర్‌లో కొనుగోలు చేసిన కొన్ని వస్తువులకు డబ్బు చెల్లించలేదనే ఆరోపణలపై మార్చి 19న US పోలీసులు వీరిని అరెస్టు చేశారు.

ఈ ఇద్దరు మహిళా స్టూడెంట్స్ మొత్తం.. రూ. 12,948.29 (USD 155) విలువైన 27 వస్తువులను తీసుకుని… కేవలం 2 వస్తువులకు మాత్రమే డబ్బులు చెల్లించి బయటకు వెళ్లారు. సీసీ ఫుటేజ్ ద్వారా వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించిన షాప్‌రైట్ స్టోర్ నిర్వాహకులు  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..  ఇద్దరు తెలుగు అమ్మాయిలను అరెస్టు చేశారు. పోలీసులు ప్రశ్నించగా.. వారిలో ఒకరు వస్తువులకు రెట్టింపు డబ్బులు చెల్లిస్తామని బ్రతిమాలారు. మరొకరు మళ్లీ ఇలా చేయమని..  వదిలిపెట్టమని కోరారు. అయితే పోలీసులు.. రూల్స్ అందుకు అంగీకరించవని వివరించి అరెస్ట్ చేశారు. దుకాణంలో చోరీ ఘటన మార్చి 19న జరిగినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.

అన్ని వస్తువులకు ఎందుకు డబ్బులు చెల్లించలేదని పోలీసులు అడిగినప్పుడు, వారిలో ఒకరు తన  అకౌంట్‌లో “లిమిటెడ్ బ్యాలెన్స్” ఉందని, మరొకరు పే చేయడం మర్చిపోయినట్లు తెలిపారు. దీంతో మరోసారి ఆ స్టోర్‌కి వెళ్లమని వ్రాతపూర్వక ధృవీకరణ ఇవ్వాలని వారిద్దరినీ కోరిన పోలీసులు.. ఆపై అరెస్ట్ చేశారు.

కాగా 2015లో, అమెరికాలోని టేనస్సీలోని వాల్‌మార్ట్ స్టోర్ నుండి రూ. 3.75 లక్షలు (USD 4,500) విలువైన 155 రేజర్లను దొంగిలిస్తూ కూడా ఇద్దరు భారతీయ మహిళలు అరెస్టయ్యారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..