Human Bones Ornaments: రాతియుగంలో బంగారం, వెండి వంటి ఖనిజాల వినియోగం లేని కాలంలో స్త్రీలు , పురుషులు ఎలాంటి ఆభరణాలు ధరించేవారు అన్నది ఇప్పటికే పలువురికి కలిగే ఆసక్తికరమైన ప్రశ్న. తాజాగా శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. శాస్త్రవేత్తలు తమ ఇటీవలి పరిశోధనలో రాతియుగంలో నివసించే వారి గురించి చెప్పిన విషయాలు షాకింగ్‌గా ఉన్నాయి. జర్నల్ ఆఫ్ ఆర్కియోలాజికల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. ఉత్తర ఐరోపాకు చెందిన యుజ్నీ ఒలెని ఓస్ట్రోవ్‌ను మధ్య రాతియుగం నాటి స్మశానవాటికగా పిలుస్తారు . ఇది సుమారు 6200 BC నాటిది. ఈ ప్రదేశంలో రాతి యుగానికి సంబంధించిన 177 లోని సమాధులు త్రవ్వబడ్డాయి. ఈ తవ్వకాల్లో బయల్పడిన విశేషాలతో శాస్త్రవేత్తలు అనేక ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నారు.
పరిశోధన నివేదిక ప్రకారం.. ఇక్కడ బయల్పడిన 177 సమాధులలో అనేక వస్తువులు ఉన్నాయి. వాటి 12 పెడెంట్లు చూసి అప్పటి ప్రజలు తమని తాము అలంకరించుకోవడానికి కొన్ని ప్రత్యేక వస్తువులను ఉపయోగించారనే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
రాతియుగం ఆభరణాలు ఎలా ఉన్నాయంటే..!
ఫై నివేదిక ప్రకారం.. ఆ యుగంలో ప్రజలు ఉపయోగించిన ఆభరణాలు బంగారం, వెండి వంటి ఖనిజాలతో తయారు చేసినవి కావు. ఎముకలతో తయారు చేసినవి. వీటిలో జంతువుల నుంచి మనుషుల వరకు ఎముకల ఆభరణాలు ఉన్నాయి. 1930లలో, ఒనెగా సరస్సులోని యుజ్నీ ఒలెనీ ఓస్ట్రోవ్ ద్వీపంలో అనేక ఎముక వస్తువులు కనుగొనబడ్డాయి. ఇక్కడ 37 లాకెట్టులు కూడా కనుగొనబడ్డాయి. వీటిని ఆ కాలం ప్రజలు ధరించేవారు. వీటిని పరిశీలించగా.. 37 లాకెట్లలో 12 మానవ ఎముకలతో తయారు చేసినవేనని తేలింది. ఆ నగలు మానవ అవశేషాల నుండి తయారు చేయబడింది.
అదే సమయంలో జంతువుల ఎముకలతో మరో 25 పెండెంట్లు తయారు చేయబడ్డాయి. ఆశ్చర్యకరంగా ఆ యుగపు ప్రజలు జంతువుల ఎముకలతో శిల్పాలు, పదునైన ఆయుధాలను చెక్కగలిగారు.అయితే ధరించే లాకెట్టులో ఎటువంటి కళాకృతి కనిపించలేదు. దానికి చాలా సింపుల్ లుక్ ఇచ్చారు.
పరిశోధన నివేదిక ప్రకారం, ఎముకలతో వివిధ రకాల ఆభరణాలు తయారు చేయబడ్డాయి. ఈ ఆభరణాలను మనుషులు తమని తాము అలంకరించుకోవడానికే కాదు బట్టలకు డిజైన్స్ గా కూడా వాడేవారు. ఉత్తర ఐరోపాలోని యుజ్నీ ఒలెని ఓస్ట్రోవ్‌లో 69 ఏళ్ల వ్యక్తి అవశేషాలు కనుగొనబడ్డాయి. పరిశోధకులు దాని డిజిటల్ చిత్రాన్ని విడుదల చేశారు. బట్టల అందాన్ని మరింత పెంచడానికి ఎముకలతో చేసిన వస్తువులను ఎలా ఉపయోగించారో ఇందులో స్పష్టంగా చూడవచ్చు.
ఇటువంటి ఆభరణాలు వారి వస్త్రధారణలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడ్డాయి. పరిశోధన నివేదిక ప్రకారం, అవశేషాలలో లభించిన ఆభరణాలలో ఎటువంటి కట్ మార్కులు లేవు. దీంతో నగల తయారీలో ప్రత్యేక డిజైనింగ్ లేదని రుజువైంది. ఇది చాలా సాధారణ పద్ధతిలో తయారు చేయబడ్డాయి. ఈ నగలను బట్టలకు , మెడ కు ధరించేవారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..