ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచాలని యోచిస్తున్న చైనా.. అసలు విషయం ఏమంటే..?

China Ageing Population: దేశంలో వేగంగా పెరుగుతున్న వృద్ధాప్య జనాభాకు అనుగుణంగా చైనా పదవీ విరమణ వయస్సును పెంచాలని యోచిస్తోంది.

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచాలని యోచిస్తున్న చైనా.. అసలు విషయం ఏమంటే..?
China Ageing Population
Follow us

|

Updated on: Mar 14, 2023 | 4:22 PM

దేశంలో వేగంగా పెరుగుతున్న వృద్ధాప్య జనాభాకు అనుగుణంగా చైనా పదవీ విరమణ వయస్సును పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు చైనా మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారిని ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ నివేదించింది. చైనీస్ అకాడమీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ సెక్యూరిటీ సైన్సెస్ ప్రెసిడెంట్ జిన్ వీగాంగ్ మాట్లాడుతూ.. పదవీ విరమణ వయస్సును పెంచడానికి చైనా అనువైన మార్గాన్ని చూస్తోందని పేర్కొన్నారు

చైనాలో పదవీ విరమణ వయస్సు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. పురుషులకు 60 సంవత్సరాలు, వైట్ కాలర్ మహిళలకు 55 ఏళ్లు.. ఫ్యాక్టరీలలో పనిచేసే మహిళలకు 50 సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే దేశ జనాభా తగ్గుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని అధికార వర్గాలు చెబుతున్నట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అయితే సంస్కరణలో ముఖ్య విషయం ఏమిటంటే, ప్రజలు తమ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడు పదవీ విరమణ చేయాలనేది ఎంచుకోవడానికి అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. యువకులు కొన్ని సంవత్సరాలు ఎక్కువ పని చేయాల్సి రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

1980 నుండి 2015 వరకు జంటలను ఒక బిడ్డకు పరిమితం చేసిన కఠినమైన ఒక బిడ్డ విధానం ఫలితంగా చైనా జనాభా 1.4 బిలియన్లు క్షీణించింది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ 60 అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల సమూహం 280 మిలియన్ల నుండి పెరుగుతున్నారి అంచనా వేస్తోంది. 2035 నాటికి 400 మిలియన్లకు పైగా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పని చేసేవారి సంఖ్య తగ్గుడటం.. వృద్ధులు పెరగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటనలు మాత్రం వెలువడలేదు.

చైనాలో జనాభా సంఖ్య తగ్గుతూ వస్తున్నది. జనాభా తగ్గుదలకు కారణాలు అనేకం ఉన్నాయి. ఈ జనాభా పెంచేందుకు చైనా ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలను రూపొందిస్తున్నది. ఇప్పటికే ఒకే బిడ్డ విధానాన్ని సడలించింది. అలాగే పలు పన్ను రాయితీలు ప్రకటించింది. అయినా.. జనాభా పెరుగకపోవడంతో తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ‘బ్రైడ్‌ ప్రైస్‌’ను రద్దు చేసింది. త్వరగా వివాహాలు చేసుకోవడంతో పాటు ఎక్కువ మంది పిల్లలనుకనే అవకాశం ఉందని భావిస్తోంది. అయితే, పెళ్లి సమయంలో అబ్బాయిలు అమ్మాయిలకు కట్నం ఇవ్వడం ఇక్కడి సంప్రదాయం. వివాహ వేడుకలు ఏడాది పొడవునా జరుగుతాయి. అంతే కాకుండా పెళ్లి విషయంలో చాలా ఖర్చు అవుతుంది. దాంతో చాలా మందికి పెళ్లిళ్లు జరుగడం లేదు. ఈ క్రమంలో ఈ సంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. పెళ్లి చేసుకోకపోయిన పిల్లలను కోనే అవకాశం కల్పిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

మేతి రైస్ ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..
మేతి రైస్ ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం భారీ కేటాయింపులు..
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం భారీ కేటాయింపులు..
టేస్టీ క్యాప్సికం ఎగ్ ఫ్రై.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
టేస్టీ క్యాప్సికం ఎగ్ ఫ్రై.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
మష్రూమ్స్‌తో ఇలా మసాలా కర్రీ చేయండి.. ఎందులోకైనా అదిరిపోతుంది!
మష్రూమ్స్‌తో ఇలా మసాలా కర్రీ చేయండి.. ఎందులోకైనా అదిరిపోతుంది!
టేస్టీ పెప్పర్ రైస్.. ఈ సీజన్‌కి బెస్ట్ రెసిపీ ఇదే!
టేస్టీ పెప్పర్ రైస్.. ఈ సీజన్‌కి బెస్ట్ రెసిపీ ఇదే!
సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..
సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..
కేరళకు వెళ్లొద్దు.. నిఫా వైరస్‌ అలజడితో హెచ్చరికలు
కేరళకు వెళ్లొద్దు.. నిఫా వైరస్‌ అలజడితో హెచ్చరికలు
జనసేన ఎమ్మెల్సీగా హైపర్ ఆది.. క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్
జనసేన ఎమ్మెల్సీగా హైపర్ ఆది.. క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్
హీరోయిన్లకు చెబుతున్నదొకటి... కెప్టెన్లు చేస్తున్నది ఇంకోటి
హీరోయిన్లకు చెబుతున్నదొకటి... కెప్టెన్లు చేస్తున్నది ఇంకోటి
టేస్టీ చిల్లీ పన్నీర్.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..
టేస్టీ చిల్లీ పన్నీర్.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..