AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ants: భూమిపై చీమల లెక్క దొరికింది.. ఎంతో తెలిస్తే షాక్..

భూమిపై ఎంత మంది మనుషులు జీవిస్తున్నారు.. ఎన్ని రకాల జీవులు ఉన్నాయి.. ఒక్కో రకం జీవులు ఎన్నెన్ని ఉన్నాయి.. ఇలా అన్ని రకాల లెక్కలు దాదాపు తెలుసు. అలాగే ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారు. ఏయే ప్రాంతాల్లో జనాభా ఎంత, ఆ జనాభాలో ఏయే వర్గాల..

Ants: భూమిపై చీమల లెక్క దొరికింది.. ఎంతో తెలిస్తే షాక్..
Ants
Amarnadh Daneti
|

Updated on: Sep 21, 2022 | 9:03 AM

Share

Ants: భూమిపై ఎంత మంది మనుషులు జీవిస్తున్నారు.. ఎన్ని రకాల జీవులు ఉన్నాయి.. ఒక్కో రకం జీవులు ఎన్నెన్ని ఉన్నాయి.. ఇలా అన్ని రకాల లెక్కలు దాదాపు తెలుసు. అలాగే ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారు. ఏయే ప్రాంతాల్లో జనాభా ఎంత, ఆ జనాభాలో ఏయే వర్గాల జనాభా ఎంత ఇలాంటి లెక్కలన్నీ జనాభా లెక్కల ద్వారా ఆయా ప్రభుత్వాలు బహిర్గతం చేస్తాయి. అయితే జంతువులకు సంబధించి ఏ జాతి జంతువులు ఎక్కడ ఉంటున్నాయి, ఎన్ని ఉంటున్నాయనేది అక్కడి ప్రభుత్వాలు లెక్కలు వెల్లడిస్తాయి. కాని భూగోళంపై చీమల సంఖ్య మాత్రం లెక్కగట్టలేము. ఎందుకంటే వాటిని కౌంట్ చేయడం చాలా కష్టం. అయితే ఈభూగోళంపై మనుషుల కంటే చీమల సంఖ్య ఎక్కువని తెలిసినప్పటికి.. వాటి సంఖ్య మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు. భారీగా ఉండే చీమల సంఖ్య ఎంత అంటే చెప్పడం అసాధ్యమే. ఎందుకంటే వాటి సంఖ్య లెక్కకట్టడం అంత తేలికైన పని కాదు. కానీ హాంకాంగ్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఈ సాహసానికి పూనుకున్నారు. చీమల సంఖ్యను లెక్కగట్టే ప్రయత్నం చేశారు. వివిధ అధ్యయనాలను విశ్లేషించి చీమల లెక్క పట్టేశారు. దాదాపు 20 వేల కోట్ల లక్షల చీమలు ఈభూగోళంపై ఉన్నట్లు లెక్కలు తేల్చారు. దాదాపు 20,000,000,000,000,000 లేదా 20 క్వాడ్రిలియన్ల చీమలు ఉన్నాయని పేర్కొన్నారు. సుమారు 489 అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. భూమిపై 20 క్వాడ్రిలియన్ల చీమలు ఉన్నాయని అంచనా వేశారు. కానీ వాటి సాంద్రత దృష్ట్యా కచ్చితమైన సంఖ్యను మాత్రం చెప్పలేకపోతున్నామని తెలిపారు.

ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. చీమలు సర్వవ్యాప్తి చెందడం వల్ల చాలా మంది ప్రకృతి శాస్త్రవేత్తలు భూమిపై వాటి సంఖ్యను చెప్పలేకపోతున్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చీమల సాంద్రతలను కొలిచే 489 అధ్యయనాల నుంచి డేటాను విశ్లేషించడం ద్వారా సంఖ్యలను అంచనా వేశామని పరిశోధకుల బృందం తెలిపింది. ఈ సంఖ్యను 20 క్వాడ్రిలియన్‌లుగా విభజించినట్లు చెప్పింది. భూగోళం మీద చీమల బయోమాస్‌ను కూడా ఈ బృందం వెల్లడించింది. 12 మిలియన్ టన్నులుగా పేర్కొంది. అడవిలో నివసించే పక్షులు, క్షీరదాల మొత్తం బరువు కలిపి సుమారు 2 మిలియన్ టన్నులు ఉంటుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి