Helicopter Crash In Alaska: అలాస్కాలో హెలికాఫ్టర్ కూలి అయిదుగురి మృతి, మరొకరికి గాయాలు,

అలాస్కాలో హెలికాఫ్టర్ కూలిన ఘటనలో అయిదుగురు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Helicopter Crash In Alaska: అలాస్కాలో హెలికాఫ్టర్ కూలి అయిదుగురి మృతి, మరొకరికి గాయాలు,
Helicopter Crash In Alaska
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 29, 2021 | 11:21 AM

అలాస్కాలో హెలికాఫ్టర్ కూలిన ఘటనలో అయిదుగురు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.   శనివారం నాడు  ఓ లాడ్జి నుంచి సరదాగా  స్కై ట్రిప్ కి వెళ్లిన వీరు  ఇలా ఘోర ప్రమాదం బారిన పడ్డారు. వీరిలో  గెస్టులు, గైడ్లు ఉన్నారు. 33 ఏళ్ళ పైలట్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి కారణం తెలియలేదు. హెలికాఫ్టర్ కూలిన స్థలం వద్ద  దీని శకలాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంపై అలాస్కా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కొలరాడో నుంచి వఛ్చిన ఓ ప్రయాణికుడు, ఇద్దరు అలాస్కా వాసులు  కూడా ఈ దుర్ఘటనలో మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.  దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి:West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సిత్రాలు.. 25శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

నందిగ్రామ్ లో రెండు బలమైన ‘కొండలను’ ఢీకొననున్న చిట్టి అభ్యర్థి, వయస్సు 36 ఏళ్ళే !