‘అతను మమ్మల్ని మోసం చేశాడు’.. ట్రంప్ తీరుపై రగిలిపోతున్న ఇరాన్ నిరసనకారులు!

ఇరాన్‌ అగ్నిగుండంలా మారింది. ఆందోళనలతో అట్టుడికింది. ఇటు ఆందోళనకారులు.. అటు భద్రతా దళాల మధ్య జరిగిన అంతర్గత పోరులో వేలాది మంది మృతి చెందారు. ఇరాన్‌ దేశంలో జరిగిన ఆందోళనలు ప్రపంచ దేశాలను కలవరపెట్టాయి. గల్ఫ్‌ దేశాలు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. లేదంటే ఇప్పటికే ఇరాన్‌లో అమెరికా సైనిక చర్య జరిగి ఉండేది.

అతను మమ్మల్ని మోసం చేశాడు.. ట్రంప్ తీరుపై రగిలిపోతున్న ఇరాన్ నిరసనకారులు!
Iranian Protest

Updated on: Jan 18, 2026 | 8:12 PM

ఇరాన్‌ అగ్నిగుండంలా మారింది. ఆందోళనలతో అట్టుడికింది. ఇటు ఆందోళనకారులు.. అటు భద్రతా దళాల మధ్య జరిగిన అంతర్గత పోరులో వేలాది మంది మృతి చెందారు. ఇరాన్‌ దేశంలో జరిగిన ఆందోళనలు ప్రపంచ దేశాలను కలవరపెట్టాయి. గల్ఫ్‌ దేశాలు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. లేదంటే ఇప్పటికే ఇరాన్‌లో అమెరికా సైనిక చర్య జరిగి ఉండేది. కానీ గల్ఫ్‌ దేశాల మధ్యవర్తిత్వంతో భారీ ముప్పు తప్పింది. అయితే ఇరాన్‌లో జరిగిన ఈ ఆందోళనలకు కారణం ఎవరనే చర్చ మొదలైంది.

ఇరాన్ అంతటా నిరసనలు వ్యాపించడంతో, కొంతమంది ప్రదర్శనకారులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన వాక్చాతుర్యం తమ ఉద్యమానికి మద్దతు పలికాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్ తమను విడిచిపెట్టారని చాలామంది నిరసనకారులు ఆరోపిస్తన్నారు. ట్రంప్ తమను మోసం చేశారని, ఆయన చర్యలు, ప్రకటనల ద్వారా తామను తప్పుదారి పట్టించారని, మోసపోయామని నిరసనకారులు మండిపడుతున్నారు.. మరోవైపు ఇరాన్ ఆందోళనలకు, ప్రాణ నష్టాలకు ట్రంపే కారణం అని ఆదేశ సుప్రీం ఖమేనీ అంటున్నారు. అందుకే ఈ నిరసనలకు మద్దతు ఇచ్చిన ట్రంప్‌ను నేరస్తుడిగా పరిగణిస్తున్నామని తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ నిరసనకారులకు బహిరంగంగా మద్దతు ప్రకటించి టెహ్రాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. “సహాయం అందుతోంది” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తరువాత శాంతియుత ప్రదర్శనకారులకు హాని కలిగిస్తే అమెరికా నిర్బంధిస్తామని చెప్పినప్పుడు, చాలా మంది ఇరానియన్లు ఈ వ్యాఖ్యలను స్పష్టమైన మద్దతు భావించారు. బహుశా సైనిక జోక్యం కూడా ఉంటుందని అనుకున్నారు. దీంతో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు తీవ్రతరం చేశారు. దీంతో చాలా కాలంగా అమలులో ఉన్న అణిచివేత చర్యలతో ఇరాన్ ప్రభుత్వం ప్రతిస్పందించింది. ఇందులో భాగంగా కమ్యూనికేషన్లను మూసివేసింది. భద్రతా దళాలను మోహరించి, ప్రాణాంతక శక్తిని ఉపయోగించింది. దేశవ్యాప్తంగా స్నిపర్ కాల్పులు, మెషిన్-గన్ దాడులు జరిగాయి. దీంతో అధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

అంతేకాదు ఈ ప్రాంతంలోని అమెరికన్లను ఇరాన్ వదిలి వెంటనే వెళ్ళమని ట్రంప్ సర్కార్ ఆదేశించింది. దీంతో ఇరాన్ ప్రభుత్వం దిగి వచ్చి హత్యలు, ఉరిశిక్షలు ఆగిపోతాయని నిరసనకారులు భావించారు. అయితే ఉద్యమకారులు ఊహించిన US సైనిక చర్య జరగలేదు. వాషింగ్టన్ జోక్యం చేసుకుంటుందని నమ్మి తమ ప్రాణాలను పణంగా పెట్టిన నిరసనకారులకు, శాంతి ప్రకటన ఒక షాక్‌లా మారిపోయింది. ఈ క్రమంలోనే నిరసన మృతుల సంఖ్యను ప్రస్తావిస్తూ, టెహ్రాన్ వ్యాపారవేత్త ఒకరు, “ఈ 15,000 మంది మరణానికి ట్రంప్ బాధ్యత వహించాలి” అని అన్నారు. “ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి పోస్ట్ చూసి, చాలా మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. ‘ఇరానియన్లను ఇలా మోసం చేయడానికి’ అమెరికా ఇస్లామిక్ రిపబ్లిక్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఉండాలి” అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. “ప్రతి ఒక్కరూ కోపంగా ఉన్నారు. ట్రంప్ మమ్మల్ని ఫిరంగి మేతగా ఉపయోగించుకున్నాడని నిరసనకారులు చెబుతున్నారు. ఇరానియన్లు తమను ఆడించారని, మోసం చేశాడని, భావిస్తున్నారు” అని ఆయన అన్నారు.

ట్రంప్ వ్యాఖ్య ప్రజల నిరసన నిర్ణయాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసిన అంచనాలను పెంచింది, కానీ అది అత్యంత ముఖ్యమైన సమయంలో ఆ మద్దతు కనిపించలేదు. కొంతమంది మూసివేసిన తలుపుల వెనుక ఒప్పందం కుదిరిందని నమ్ముతున్నారు. మరికొందరు ఉదాసీనతను చూస్తున్నారు.

ఇదిలావుంటే, ఇరాన్‌లో జరిగిన ఆందోళనల్లో దాదాపు వేలాది మంది మరణించారు. మరోవైపు ఇరాన్‌లో ఆందోళనలకు కారణమైన 800 మందిని ఉరి తీయాలని ముందుగా భావించినా గల్ఫ్‌ దేశాల జోక్యంతో అక్కడి ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో గల్ఫ్‌ దేశాలు అటు అమెరికా, ఇటు ఇరాన్‌ మధ్య మధ్యవర్తిత్వం వహించారు. ఇరాన్‌ 800 మందిని ఉరి తీయకుండా అడ్డుకోవడంలో, అటు ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు దిగకుండా కట్టడి చేశాయి. ఈ విషయంలో సౌదీ అరేబియాతో పాటు ఇతర గల్ఫ్‌ దేశాలు సక్సెస్‌ అయ్యాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..