AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H-1B Visa: అమెరికాలో ఇండియన్లకు కొత్త చిక్కులు..! గడువుకు ముందే నోటీసులు..

అమెరికాలోని భారతీయ H-1B వీసాదారులకు బహిష్కరణ నోటీసులు వస్తున్నాయి. 60 రోజుల గడువుకు ముందే నోటీసులు రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నోటీసులు వచ్చాక చేసేదేమి లేక దేశానికి తిరిగి రావాల్సి వస్తోంది. ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత వారు ఆర్థిక, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

H-1B Visa: అమెరికాలో ఇండియన్లకు కొత్త చిక్కులు..! గడువుకు ముందే నోటీసులు..
H-1B Visa Deportation Notice
Krishna S
|

Updated on: Aug 13, 2025 | 12:45 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ నివసిస్తున్న ఇతర దేశాల పౌరులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మొదట వీసా నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్ ప్రభుత్వం.. ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులకు గడువు ముగియకముందే బహిష్కరణ నోటీసులు జారీ చేస్తోంది. ఈ పరిణామంతో అక్కడి భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

గడువుకు ముందే బహిష్కరణ నోటీసులు

సాధారణంగా, అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా తమ వీసా స్టేటస్‌ను మార్చుకోవడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అయితే ఈ గడువు ముగియకముందే.. చాలా సందర్భాల్లో కేవలం రెండు వారాల్లోనే నేరుగా బహిష్కరణ నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసులు అందుకున్న తర్వాత భారత్‌కు తిరిగి రావడం తప్ప వేరే మార్గం లేదని చాలామంది అంటున్నారు.

ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయులు

తాజా సర్వేల ప్రకారం.. అమెరికాలో నివసిస్తున్న 45 శాతం మంది భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో 26 శాతం మంది ఇతర దేశాలకు వలస వెళ్లా.. మిగిలినవారు భారత్‌కు తిరిగి రావాలని ఆలోచిస్తున్నారు. గడువు ముందే నోటీసులు రావడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాను వదిలి వెళ్తే తమ జీతం, జీవనశైలి ప్రభావితం అవుతాయని, కొత్త ఉద్యోగావకాశాలు కూడా తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, తమ కుటుంబాల భవిష్యత్తు గురించి భయపడుతున్న చాలామంది భారతీయులు, అమెరికాలో తిరిగి మంచి ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడాలని ఆశిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..