బలూచిస్థాన్‌లో దారుణం.. ఆర్మీ దుస్తుల్లో వచ్చి.. కిరాతకం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోరం జరిగింది. కరాచీలోని పోర్ట్‌ మెగాసిటీ నుంచి ఒర్మారాలోని తీర ప్రాంత పట్టణానికి వెళ్తున్న నాలుగు బస్సులను కొంతమంది దుండగులు అడ్డుకున్నారు. అందులో ఉన్న ప్రయాణికుల గుర్తింపు కార్డులను అడుగుతూ.. స్థానికేతరులైన 14మందిని కిందకు దింపారు. అనంతరం వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హతమార్చారు. అయితే బలూచిస్థాన్‌ వేర్పాటువాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 12 మంది.. మిలటరీ దుస్తుల్లో వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:59 pm, Thu, 18 April 19
బలూచిస్థాన్‌లో దారుణం.. ఆర్మీ దుస్తుల్లో వచ్చి.. కిరాతకం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోరం జరిగింది. కరాచీలోని పోర్ట్‌ మెగాసిటీ నుంచి ఒర్మారాలోని తీర ప్రాంత పట్టణానికి వెళ్తున్న నాలుగు బస్సులను కొంతమంది దుండగులు అడ్డుకున్నారు. అందులో ఉన్న ప్రయాణికుల గుర్తింపు కార్డులను అడుగుతూ.. స్థానికేతరులైన 14మందిని కిందకు దింపారు. అనంతరం వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హతమార్చారు. అయితే బలూచిస్థాన్‌ వేర్పాటువాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 12 మంది.. మిలటరీ దుస్తుల్లో వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు వారు తెలిపారు.