Pakistan PM Ex-Wife: ఇదేనా నయా పాకిస్తాన్?.. ప్రధాని ఇమ్రాన్‌పై దుమ్మెత్తిపోసిన మాజీ భార్య..

|

Jan 03, 2022 | 11:25 AM

Pakistan PM Ex-Wife: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అతని మాజీ భార్య రెహమ్ ఖాన్ సంచలన ఆరోపణలు చేసింది. ఇమ్రాన్ పాలనా విధానాలను తులనాడింది.

Pakistan PM Ex-Wife: ఇదేనా నయా పాకిస్తాన్?.. ప్రధాని ఇమ్రాన్‌పై దుమ్మెత్తిపోసిన మాజీ భార్య..
Follow us on

Pakistan PM Ex-Wife: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అతని మాజీ భార్య రెహమ్ ఖాన్ సంచలన ఆరోపణలు చేసింది. ఇమ్రాన్ పాలనా విధానాలను తులనాడింది. ఇదేనా నయా పాకిస్తాన్ అంటూ దుమ్మెత్తిపోసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విరుచుకుపడింది. ఆదివారం రాత్రి తాను ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని తెలిపింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన రెహమ్ ఖాన్.. ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ పిరికిపందలు, దుండగులు, అత్యాశపరుల దేశంగా మారిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘నా మేనల్లుడి వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా.. నా కారుపై కాల్పులు జరిగాయి. మోటర్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నా వాహనాన్ని అడ్డగించారు. గన్‌ పాయింట్‌లో తుపాకీ పెట్టారు. నేను తప్పించుకుని వేరే కారులో బయలుదేరాను. నా పర్సన్ సెక్రటరీ, డ్రైవర్ కారులోనే ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ కొత్త పాకిస్థాన్ ఇదేనా? పిరికిపందలు, దుండగులు, దురాశపరుల దేశంగా మారింది.’’ అంటూ రెహమ్ ఖాన్ ట్వీట్ చేసింది.

తాను క్షేమంగా బయటపడినప్పటికీ.. ఈ ఘటన ఆగ్రహం, భయాందోళనకు గురి చేసిందన్నారు. కాగా, బ్రిటీష్-పాకిస్థానీ మూలానికి చెందిన జర్నలిస్ట్, మాజీ టీవీ యాంకర్ రెహమ్ ఖాన్‌.. ఇమ్రాన్ ఖాన్‌ను 2014లో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇమ్రాన్‌ ఖాన్‌పై విమర్శల బాణాలు ఎక్కు పెడుతూ వస్తోంది రెహమ్ ఖాన్. అతని పరిపాలనలోని లోపాలను ఎత్తి చూపుతోంది. 2019లో పుల్వామా దాడి తర్వాత, ఇమ్రాన్ ఖాన్ దేశ సైన్యానికి కీలుబొమ్మలా మారారని పలు సందర్భాల్లో విమర్శించారు. భావజాలం, మితవాద విధానంపై రాజీపడి అధికారంలోకి వచ్చారని రెహమ్ ఖాన్ అన్నారు.

Also read:

India Corona: భారతదేశంలో మరోసారి మొదలైన వ్యాప్తి.. గత 24 గంటల్లో 33 వేలకు పైగా కొత్త కరోనా కేసులు

LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్‌కు ఎక్స్‌పయిరీ తేదీ ఉంటుందనే విషయం తెలుసా..? దానిని గుర్తించడం ఎలా..? పూర్తి వివరాలు

Vastu Tips: ఇంట్లో పూజ గది ఏర్పాటులో ఈ నియమాలు పాటించండి.. సంపద, సంతోషం మీ సొంతం..