Poland Ukraine Border: యుద్ధానికి దగ్గరగా కేంద్ర మంత్రులు.. ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద.. భారతీయుల తరలింపులో పాలుపంచుకుంటున్న..
Poland Ukraine Border: రష్యా(Russia), ఉక్రెయిన్ ల మధ్య పోరు రోజు రోజుకీ మరింత ముదురుతోంది. దీంతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను(Indians) తిరిగి స్వదేశానికి తరలించడానికి చర్యలు మరింత వేగవంతం..
Poland Ukraine Border: రష్యా(Russia), ఉక్రెయిన్ ల మధ్య పోరు రోజు రోజుకీ మరింత ముదురుతోంది. దీంతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను(Indians) తిరిగి స్వదేశానికి తరలించడానికి చర్యలు మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్ గంగా” ను చేపట్టి.. చాలామంది భారతీయుల విద్యార్థులను తిరిగి భారత్ కు తీసుకుని వచ్చారు. అయితే భారతీయులను రక్షించడానికి సురక్షితంగా తరలించడానికి కేంద్ర మంత్రులే స్వయంగా రంగంలోకి దిగారు. పశ్చిమ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం వార్సాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు పోలాండ్ సరిహద్దులో కొత్త ఎంట్రీ పాయింట్‌ను గుర్తించారు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయుల తరలింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) బుధవారం పోలాండ్-ఉక్రెయిన్ సరిహద్దులోని బుడోమియర్జ్‌ను సందర్శించారు. ఈ వీడియో ఒకటి ట్విట్టర్ లో పోస్టు చేశారు.
The Govt. of India under the leadership of @narendramodi ji is determined to not spare any effort to ensure the safe return of our people from #Ukraine. I repeat – no Indian will be left behind. Please hold on, and adhere to the guidelines issued by our agencies.#OperationGanga pic.twitter.com/rmCuixNgoB
— General Vijay Kumar Singh (@Gen_VKSingh) March 2, 2022
పోలాండ్‌లోని భారత రాయబారి నగ్మా మల్లిక్‌తో కలిసి సహాయ మంత్రి విజయ్ కుమార్ సింగ్ పోలాండ్ – ఉక్రెయిన్ సరిహద్దులోని బుడోమియర్జ్ దగ్గర భారతీయ విద్యార్థులతో కొంత సేపు గడిపారు. వారితో కొంచెం సేపు ముచ్చటించారు. స్వయంగా మంచి నీళ్ల బాటిళ్లు, ఆహారం అందించారు. తనకు భారతీయ విద్యార్థుల మానసిక దృఢత్వం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని.. జై హింద్ అంటూ వీడియో పాటు ట్వీట్ చేశారు.
అక్కడి భారతీయ విద్యార్థులతో సమావేశమైన అనంతరం సింగ్ మాట్లాడుతూ.. తాము అలసిపోయినప్పటికీ, వారిని తిరిగి తమ మాతృదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఉపశమనం పొందుతున్నారని చెప్పారు. పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్ , టెర్నోపిల్ లతో పాటు ఇతర ప్రదేశాలలో చిక్కుకున్న లేదా ఉంటున్న విద్యార్థులతో సహా భారతీయ పౌరులు పోలాండ్‌లోకి త్వరగా ప్రవేశించడానికి బుడోమియర్జ్ సరిహద్దు చెక్‌పాయింట్‌కు వీలైనంత త్వరగా ప్రయాణించాలని ఎంబసీ అధికారులు తెలిపారు
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపును పర్యవేక్షించేందుకు ఉక్రెయిన్‌తో సరిహద్దుకు సమీపంలోని స్లోవేకియాలోని కోసిస్‌కు ప్రభుత్వ మరో ప్రత్యేక ప్రతినిధి, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు చేరుకున్నారు. ‘ఆపరేషన్ గంగా’ కింద తరలింపు మిషన్‌ను సులభతరం చేసేందుకు స్లోవేకియాలోని భారత రాయబారి వన్‌లాల్‌హుమా, బ్రస్సెల్స్‌లోని భారత రాయబార కార్యాలయంలో మొదటి కార్యదర్శి పంకజ్ ఫుకాన్ కూడా అక్కడికి చేరుకున్నారు.
Also Read: