UK New PM: బ్రిటన్‌ కొత్త ప్రధాని ఎంపికకు ముహూర్తం ఖరారు.. రేస్‌లో ఇన్పోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్‌

|

Jul 15, 2022 | 6:16 PM

బోరిస్‌ జాన్సన్‌ కేబినెట్ నుంచి మొదట తప్పుకున్నది కూడా రిషినే. ఆ తర్వాతే ఇతర మంత్రులు రాజీనామా చేశారు. వరుస కుంభకోణాలతో జాన్సన్‌ ప్రతిష్ట మసకబారింది.

UK New PM: బ్రిటన్‌ కొత్త ప్రధాని ఎంపికకు ముహూర్తం ఖరారు.. రేస్‌లో ఇన్పోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్‌
Uk New Pm Elections
Follow us on

UK New PM: బ్రిటన్‌ కొత్త ప్రధాని ఎవరో సెప్టెంబర్‌ 5న తేలనుంది. ఆ రోజు కొత్త ప్రధానిని ఎంపిక చేయాలని నిర్ణయించింది అధికార కన్జర్వేటివ్ పార్టీ (Servative party). ప్రధాని పదవికి పోటీ పడాలనుకునే వారికి కనీసం 20 మంది తమ సహచర ఎంపీల మద్దతు ఉండాలి. ఈ మద్దతును సంపాదించుకున్న రిషి సునాక్‌ అప్పుడే తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. భారత సంతతికి చెందిన రిషి ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌ నారాయణమూర్తికి అల్లుడు. ప్రధాని రేసులో ముందున్న రిషికి బ్రిటన్‌ రవాణా మంత్రి గ్రాంట్‌ షాప్స్‌ మద్దతు లభించడం విశేషం. గ్రాంట్‌ తాను పోటీ నుంచి విరమించుకుని రిషికి మద్దతు ఇస్తున్నట్టు అనౌన్స్‌ చేశారు. మొన్నటివరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు రిషి. బోరిస్‌ జాన్సన్‌ కేబినెట్ నుంచి మొదట తప్పుకున్నది కూడా రిషినే. ఆ తర్వాతే ఇతర మంత్రులు రాజీనామా చేశారు.

వరుస కుంభకోణాలతో జాన్సన్‌ ప్రతిష్ట మసకబారింది. మరోవైపు దడ పుట్టిస్తున్న ద్రవోల్బణం, అప్పుల భారం, కుంటుపడిన ప్రగతి బ్రిటన్‌ ఎకానమీకి గుదిబండగా మారాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్‌, ఇతర మంత్రుల రాజీనామాలతో జాన్సన్‌ రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు. రిషితో పాటు 10 మంది ప్రధాని పదవికి పోటీలో ఉంటారని భావిస్తున్నారు. పోటీలో ఉన్నవారిని పార్టీ నేతలు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. రౌండ్ల వారీగా ఓటింగ్ నిర్వహించి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. చివరకు మిగిలిన ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే కన్జర్వేటివ్ పార్టీ కొత్త సారథిగా, ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..