Global Indians: స్కాలర్ షిప్ డబ్బులతో విద్యాసేవ చేస్తున్న విద్యార్ధులు.. దేశం ఎల్లలు దాటి ‘ఫ్లై’
తాము చదువుకుంటూ తమలాంటి మరింతమంది పిల్లలకు చదువుకునేందుకు సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు. సాధారణంగా తమ చదువులు తమని చదవమంటేనే కుంటిసాకులతో చదువులు తప్పించుకుందామని చూసేవారు చాలామంది పిల్లలు ఉంటారు.
Global Indians: తాము చదువుకుంటూ తమలాంటి మరింతమంది పిల్లలకు చదువుకునేందుకు సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు. సాధారణంగా తమ చదువులు తమని చదవమంటేనే కుంటిసాకులతో చదువులు తప్పించుకుందామని చూసేవారు చాలామంది పిల్లలు ఉంటారు. కానీ, వారికీ భిన్నంగా కలాష్, దేవేష్ అనే అక్క తమ్ముళ్లు 300 మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. వారిద్దరికీ 16 ఏళ్లు, ఈ చిన్న వయస్సులో దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా పేద పిల్లల అదృష్టానికి సహకరిస్తున్నారు. ఈ సోదరి-సోదరుల జంట ఫన్ లెర్నింగ్ యూత్ (FLY) అనే సంస్థను ప్రారంభించారు. దీని ద్వారా పేద కుటుంబాల పిల్లలకు విద్యనందిస్తున్నారు. కలాష్ ALLENలో చదువుతూ 11వ తరగతిలో ఇంజనీరింగ్‌కు సిద్ధమవుతోంది. అదే సమయంలో, సోదరుడు దేవేష్ కూడా ALLEN లోనే PNCF లో 9 తరగతి చదువుతున్నాడు. వీరిద్దరూ గత మూడేళ్లుగా రాజస్తాన్ కోటాలో చదువుతున్నారు.
జాతీయ-అంతర్జాతీయ పోటీల్లో 150 పతకాలు
కలాష్ .. దేవేష్ వారి స్కాలర్‌షిప్ డబ్బుతో ఈ పిల్లలకు స్టేషనరీ.. పుస్తకాలు ఏర్పాటు చేస్తారు. 16 ఏళ్ల కలాష్, 14 ఏళ్ల దేవేష్ జాతీయ, అంతర్జాతీయ పరీక్షల్లో ఇప్పటి వరకు 150 బంగారు పతకాలు, 200కు పైగా సర్టిఫికెట్లు సాధించారు. దీంతో పాటు ఇద్దరికీ రజతం, కాంస్య పతకాలు కూడా ఉన్నాయి. ఇటీవల దేవేష్ ఐజేఎస్‌ఓలో బంగారు పతకం సాధించి దేశ గౌరవాన్ని పెంచాడు. ప్రధానమంత్రి బాల శక్తి పురస్కారంతో కూడా అతనిని సత్కరించారు. తండ్రి పంకజ్ భయ్యా సివిల్ ఇంజనీర్ .. తల్లి పల్లవి భయ్యా ఆర్కిటెక్ట్. తల్లి కోటాలో ఉంటూ పిల్లలతో ఆన్‌లైన్ లో పని చేస్తున్నారు.
ఫ్లై వెబ్‌సైట్ ద్వారా ఆఫ్రికాలోని రువాండాలో విద్యార్థులకు బోధన..
కరోనా సమయంలో చాలా మంది పిల్లలు వారి తల్లిదండ్రులు మహామ్మరితో మరణించడంతో చదువులకు దూరం అయ్యారు. ఇలా ఎందరో పిల్లల చదువుకు నోచుకోకుండా ఉండిపోయారు. ఈ పరిస్థితి గమనించిన కలాష్ .. దేవేష్ తమ సామర్థ్యానికి తగ్గట్టుగా పిల్లలకు నేర్పించడం మొదలు పెట్టారు. ఈ పని వారు మొదటి కరోనా వేవ్ సమయంలో ఆగస్టు 2020లో ప్రారంభించారు. మొదట్లో వీరు పార్కింగ్ స్థలాల్లో.. తోటల్లో పిల్లలకు పాఠాలు నేర్పేవారు. తరువాత వీరు ఫ్లై వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీంతో విదేశాల్లో కూడా వీరు పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. ఆఫ్రికాలోని రువాండాలో విద్యార్థులకు తమ వెబ్సైట్ ద్వారా చదువు అందిస్తున్నారు.
లాక్డౌన్ సమయంలో పని చేసే మహిళ పిల్లలను చూసిన తర్వాత ఈ ఆలోచన..
మొదటి లాక్డౌన్ సమయంలో, మేము మహారాష్ట్రలోని జల్గావ్‌లోని మా ఇంటికి వెళ్లామని కలాష్ చెప్పారు. అక్కడ స్కూల్ మూసేయడం వల్ల రాహుల్, మా ఇంట్లో పనిచేసే ఆమె సోదరుడు అతని కూతురు పూజ చదువుకు ఇబ్బంది పడటం చూశాం. రాహుల్ చదువు మానేసి నామమాత్రపు జీతానికి ఎక్కడో పని చేయడంతో ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారింది. నేను వారికి చదువు నేర్పించడం ప్రారంభించాను. కొద్ది రోజుల్లోనే వారు ఇతర పిల్లలను కూడా తీసుకురావడం ప్రారంభించారు. లాక్ డౌన్ ఉంది కానీ, సామాజిక దూరాన్ని దృష్టిలో ఉంచుకుని, మేము వివిధ సమూహాలలో పిల్లలకు బోధించాము.
పిల్లల స్టేషనరీ కోసం 8 లక్షల రూపాయల స్కాలర్ షిప్ ఖర్చు..
కలాష్, దేవేష్‌ల తల్లి పల్లవి భయ్యా మాట్లాడుతూ.. చదువుకోవడానికి వచ్చే పిల్లలు చాలా పేద కుటుంబాలకు చెందినవారని చెప్పారు. అటువంటి పరిస్థితిలో, ఇద్దరూ తమ స్టేషనరీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీరిద్దరూ ఎన్నో పోటీల్లో పతకాలు సాధించారు. అలాగే రూ.8 లక్షల వరకు స్కాలర్ షిప్ పొందారు. ఈ డబ్బుతో పిల్లల పుస్తకాలు, కాపీలు, పెన్నులు, ఇతర అవసరమైన స్టేషనరీ వస్తువులు అందించారు అని చెప్పారు.
లాక్‌డౌన్‌లో ఇద్దరు పిల్లలకు బోధించడం ద్వారా మొదలైన వీరి విద్యాసేవ ఇప్పుడు 300కి చేరింది. ఇప్పుడు వారి ఉద్దేశ్యం ఒక NGO రూపాన్ని సంతరించుకుం., దీని పేరు ‘ఫన్ లెర్నింగ్ యూత్’ . ఇప్పటి వరకు 300 మందికి పైగా పిల్లలకు దీని ద్వారా బోధించారు. వీరిద్దరి స్నేహితులు కూడా ఈ పనిలో పడ్డారు. 15 మందితో కూడిన బృందంలో 10 మంది పర్మినెంట్‌లు, 4 మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్లంతా కూడా పిల్లలకు చదువు నేర్పిస్తారు.
ఇవి కూడా చదవండి: Crypto Currency: బిట్ కాయిన్ కొనుగోలుదారులు అలర్ట్.. క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలపై IC15 నిఘా!