Saudi Arab: జీవనం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు.. ఎడారిలో చిక్కుకుని 4 రోజులు తిండి, నీరు లేక తెలంగాణ వాసి మృతి

|

Aug 24, 2024 | 8:53 AM

సౌదీ అరేబియాలో ఎండ తీవ్ర చాలా అధికంగా ఉంది. తాజాగా ఉష్ణోగ్రత కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. భారతదేశంలోని తెలంగాణా నివాసి అయిన ఓ వ్యక్తీ సౌదీ అరేబియాలోని దక్షిణ ఎడారిలో తప్పిపోయాడు. దీనిని ఖాళీ క్వార్టర్ లేదా అరబిక్‌లో రబ్ అల్-ఖాలీ అని పిలుస్తారు. ఇది భూమిపై అత్యంత నిర్జనమైన ప్రదేశాలలో ఒకటి. 27 సంవత్సరాల మహ్మద్ షాజాద్ ఖాన్ ఎండలో నిరంతరం నడవడం వల్ల డీహైడ్రేషన్‌తో మరణించాడు. మహ్మద్ షాజాద్ తెలంగాణలోని కరీంనగర్ నివాసిగా గుర్తించారు.

Saudi Arab: జీవనం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు.. ఎడారిలో చిక్కుకుని 4 రోజులు తిండి, నీరు లేక తెలంగాణ వాసి మృతి
Mohammed Shahzad Khan
Follow us on

సౌదీ అరేబియాలో ఎండ తీవ్ర చాలా అధికంగా ఉంది. తాజాగా ఉష్ణోగ్రత కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. భారతదేశంలోని తెలంగాణా నివాసి అయిన ఓ వ్యక్తీ సౌదీ అరేబియాలోని దక్షిణ ఎడారిలో తప్పిపోయాడు. దీనిని ఖాళీ క్వార్టర్ లేదా అరబిక్‌లో రబ్ అల్-ఖాలీ అని పిలుస్తారు. ఇది భూమిపై అత్యంత నిర్జనమైన ప్రదేశాలలో ఒకటి. 27 సంవత్సరాల మహ్మద్ షాజాద్ ఖాన్ ఎండలో నిరంతరం నడవడం వల్ల డీహైడ్రేషన్‌తో మరణించాడు. మహ్మద్ షాజాద్ తెలంగాణలోని కరీంనగర్ నివాసిగా గుర్తించారు.

ఎలా చనిపోయాడంటే

మహ్మద్ షాజాద్ సౌదీ అరేబియాలోని ఎడారిలో ఒక సుడానీస్ పౌరుడితో ఉన్నప్పుడు అకస్మాత్తుగా GPS సిగ్నల్ రావడం ఆగిపోయింది. అదే సమయంలో మొబైల్ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ తో పాటు కారులో ఇంధనం కూడా అయిపోయింది. దీని కారణంగా షాజాద్, సూడాన్ పౌరుడు ఎడారిలో చిక్కుకున్నారు. నాలుగు రోజులుగా ఎడారిలో చిక్కుకుపోయి.. సూర్యకాంతి, వేడి బారిన పడ్డారు. అదే సమయంలో తినడానికి ఆహారం, నీరు లేకపోవడం వల్ల వారిద్దరూ మరణించారు. షాజాద్ ఖాన్ మృతదేహంతో పాటు అతని సహోద్యోగి మృతదేహం అతని కారు పక్కన ఉన్న ఇసుక తిన్నెలలో గురువారం కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి

సౌదీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంటే

షాజాద్ గత మూడు సంవత్సరాలుగా సౌదీ అరేబియాలోని టెలికమ్యూనికేషన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ మరణించినరబ్ అల్ ఖలీ ఎడారి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఎడారులలో ఒకటి. ఈ ఎడారి 650 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇది ఉత్తర సౌదీ అరేబియాలోని హోఫుఫ్ నుంచి రియాద్, సౌదీ అరేబియాలోని నజ్రాన్ ప్రావిన్సులు, UAE, ఒమన్ , యెమెన్ వరకు విస్తరించి ఉంది.

విపరీతమైన వేడి కారణంగా మరణిస్తున్న హజ్ యాత్రికులు

సౌదీ అరేబియాలో ఎండ వేడిమి కారణంగా ఈ ఏడాది భారీ సంఖ్యలో హజ్ యాత్రికులు మరణించారు. ఎండ వేడిమికి 2700 మందికి పైగా యాత్రికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంవత్సరం, 1.8 మిలియన్ల మంది ప్రజలు హజ్ చేసారు. అయితే తీవ్రమైన వేడి కారణంగా కొందరు అనారోగ్యానికి గురయ్యారు. మరికొందరు మరణించారు. మరణించినవారిలో గరిష్టంగా 323 ఈజిప్షియన్ పౌరులు ఉన్నారు. అదే సమయంలో భారత పౌరులు 68 మంది హజ్ సమయంలో మరణించారు.యు జోర్డాన్ నుండి మొత్తం 60 మంది హజ్ యాత్రికులు మరణించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..