కువైట్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. నాలుగు గంటల్లో భారత్ నుంచి కువైట్‌కు చేరుకోవచ్చని, కాని భారత ప్రధాని ఇక్కడికి రావడానికి 40 ఏళ్లు పట్టిందన్నారు మోదీ. కువైట్ అభివృద్దిలో భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.
కువైట్‌లో ప్రధాని మోదీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. 43 ఏళ్ల తరువాత తొలిసారి భారత ప్రధాని కువైట్‌లో పర్యటిస్తున్నారు. ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. కువైట్ రాజకుటుంబంతో చర్చలు జరిపారు. గతంలో ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు. భారతదేశం- కువైట్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయి. రక్షణ, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం ఈ పర్యటనలో ప్రధానాంశంగా ఉంటుందని భారత అధికారులు తెలిపారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, రక్షణ సహకార ఒప్పందం కోసం కువైట్‌తో చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
కువైట్ పర్యటనలో భాగంగా నిర్వహించిన హలా మోదీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. భారత్ నుంచి కువైట్ చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతుందని , కాని భారత ప్రధాని ఇక్కడికి రావడానికి నాలుగు దశాబ్ధాలు పట్టిందన్నారు మోదీ. ఎన్నో ఏళ్ల నుంచి కువైట్‌కు భారతీయులు ఉపాధి కోసం వస్తున్నారని అన్నారు. కువైట్ ఆర్ధికాభివృద్దిలో భారతీయుల పాత్ర కీలకమన్నారు. ఎన్నో దశాబ్ధాల నుంచి ఇక్కడికి భారతీయులు ఉపాధి కోసం వస్తున్నారు. ప్రతి ఏటా ఇక్కడికి వచ్చే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. కువైట్‌కు భారతీయతను జోడించారని ప్రధాని మోదీ ప్రశంసించారు. కువైట్‌లో భారత కార్మికులతో ముచ్చటించారు మోదీ. ప్రవాస భారతీయులకు ప్రభుత్వం అన్నివిధాలులుగా అండగా ఉంటుందన్నారు. తన ముందు చిన్న భారతదేశాన్ని చూసినట్లు అనిపించిందని అన్నారు.
భారతదేశం, కువైట్ మధ్య సంబంధాలను ప్రశంసించిన ప్రధాన మంత్రి, రెండు దేశాలు దౌత్యం ద్వారానే కాకుండా హృదయాలు కూడా కలిసిపోయాయన్నారు. భారత్ – కువైట్‌లకు నాగరికత, సముద్రం, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య అరేబియా సముద్రానికి రెండు వైపులా ఉన్నాయి, దౌత్యం ద్వారా మాత్రమే కాకుండా హృదయాలతో కలిసిపోయామన్నారు. ‘కొత్త కువైట్’కి అవసరమైన మానవశక్తి, నైపుణ్యాలు, సాంకేతికత భారత్‌లో ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..