Dubai: దేశాలు దాటినా సంస్కృతి మరవని గల్ఫ్ కార్మికులు.. ఒగ్గు కళాకారుల సాంప్రదాయ పూజలు

| Edited By: Surya Kala

Dec 26, 2023 | 1:06 PM

సప్త సముద్రాలు దాటిన స్వయం ఉపాధి కోసం వలస వెళ్లిన ఒగ్గు పూజారులు తమ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. సట్టి వారాలను పురస్కరించుకొని దుబాయిలోని బార్ దుబాయ్ లో కొమురవేల్లి మల్లన్న ను కొలుస్తూ తరిస్తున్నారు. మల్లికార్జునుడి ప్రార్థనతో ఆకట్టుకుంటూ తమదైన శైలిలో పూజలు చేస్తున్నారు. ప్రతి ఏటా పవిత్రమైన శట్టి వారాలలో మల్లన్న పట్నాల సందడితో పల్లెలలో ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంటాయి

Dubai: దేశాలు దాటినా సంస్కృతి మరవని గల్ఫ్ కార్మికులు.. ఒగ్గు కళాకారుల సాంప్రదాయ పూజలు
Mallanna Puja At Dubai
Follow us on

డమరుకం దరువులు.. పిల్లన గ్రోవి పలుకులు.. కనక డప్పుల మోతలు.. డోలుమేళాల లయబద్ధమైన సప్పుళ్లు. కాలి అందెల సవ్వడికి అనుగుణంగా పాదం కదిపే ఒగ్గు పూజారులు.. గుగ్గిలం, మైసాచ్చి పొగలు.. శివ సత్తుల పూనకాలు.. భక్తి పారవశ్యంలో లీనమయ్యే ప్రజలు. ఇలా ప్రతి ఏటా పవిత్రమైన శట్టి వారాలలో మల్లన్న పట్నాల సందడితో పల్లెలలో ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంటాయి.

కాగా సప్త సముద్రాలు దాటిన స్వయం ఉపాధి కోసం వలస వెళ్లిన ఒగ్గు పూజారులు తమ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. సట్టి వారాలను పురస్కరించుకొని దుబాయిలోని బార్ దుబాయ్ లో కొమురవేల్లి మల్లన్న ను కొలుస్తూ తరిస్తున్నారు. మల్లికార్జునుడి ప్రార్థనతో ఆకట్టుకుంటూ తమదైన శైలిలో పూజలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నిజామాబాద్ జిల్లా కు చెందిన పలువురు , రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి మండలాలకు చెందిన పలువురు గల్ఫ్ కార్మికులు తాము నివసించే చోట మల్లన్న స్వామి వారిని మదిలో తలుచుకుంటూ అత్యంత భక్తిశ్రద్ధల తో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన ధూప దీప నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. తాము తమ కుటుంబాలతో పాటు సబ్బండ వర్గాలు చల్లగా ఉండాలని ఒక్క పొద్దులతో స్వామివారిని వేడుకుంటున్నారు. కాగా దుబాయిలో ఒగ్గు పూజారులు మల్లికార్జునుడికి నిర్వహిస్తున్న పూజారి క్రతువులు పలువురుని ఆకట్టుకుంటున్నాయి. భగవంతుని పట్ల భక్తితో పాటు సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి కలం అక్షర సత్యం ఫేసుబుక్ పేజీ లైవ్ ద్వారా అడ్మిన్ చూపించడంతో ఇటు అడ్మిన్ ను అటు కార్మికులను పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..