Los Angeles Road Accident: జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. లింగాల ఘనపూర్ మండలం బండ్లగూడేనికి చెందిన NRI రాంచంద్రారెడ్డి కుమారుడు, కుమార్తె..అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారం రోజుల క్రితం లాస్ ఏంజిల్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో NRI రాంచంద్రారెడ్డి కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది అమెరికా మహిళ. ఈ ప్రమాదంలో ఆర్జిత్‌రెడ్డి స్పాట్‌లోనే మృతి చెందారు. అయితే ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అక్షితారెడ్డి.. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు.
మృతుడి బాబాయి రవీందర్‌రెడ్డి అందించిన వివరాల ప్రకారం.. బండ్లగూడెంకు చెందిన రాంచంద్రారెడ్డి, రజని దంపతులు 20 ఏళ్ల క్రితం లాస్ ఏంజిల్స్ వెళ్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరి కూతురు అక్షితారెడ్డి పదకొండో తరగతి, కొడుకు ఆర్జిత్‌రెడ్డి పదో తరగతి చదువుతున్నారు.
శనివారం మిత్రుడి ఇంట్లో విందు ఉండగా కుటుంబ సభ్యులతో వెళ్లారు. రాత్రి 11 గంటలకు తిరిగి వస్తుండగా.. ఓ మూలమలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆర్జిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటనలో కూతరు అక్షితరెడ్డికి గాయాలతో ఆసుపత్రిలో చేరారు. రాంచంద్రారెడ్డి, రజనిలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో NRI రామచంద్రారెడ్డి స్వగ్రామం బండ్లగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి: New Year Recipe: న్యూ ఇయర్ వేడుకల్లో మోజారెల్లా స్టిక్స్ మీ కుటుంబ సభ్యులను ఖుష్ చేయండి.. వీటి ఇలా ట్రై చేయండి..
Trending Video: అయ్యో..! ఆపదలో పప్పి.. చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా..