Vinai Thummalapally: అమెరికాలో హైదరాబాదీకి అరుదైన గౌరవం.. యుఎస్‌టిడిఎ డిప్యూటీ డైరెక్టర్ నియమించిన ప్రెసిడెంట్ జో బిడెన్

|

Oct 20, 2021 | 2:02 PM

తెలుగు వ్యక్తి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. భారతీయ అమెరికన్ మాజీ దౌత్యవేత్త వినయ్ తుమ్మలపల్లిని యుఎస్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (యుఎస్‌టిడిఎ) డిప్యూటీ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా..

Vinai Thummalapally: అమెరికాలో హైదరాబాదీకి అరుదైన గౌరవం.. యుఎస్‌టిడిఎ డిప్యూటీ డైరెక్టర్ నియమించిన ప్రెసిడెంట్ జో బిడెన్
Vinai Thummalapally
Follow us on

తెలుగు వ్యక్తి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. భారతీయ అమెరికన్ మాజీ దౌత్యవేత్త వినయ్ తుమ్మలపల్లిని యుఎస్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (యుఎస్‌టిడిఎ) డిప్యూటీ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ నియమించారు. ప్రవాస భారతీయుడైన వినయ్‌ తుమ్మలపల్లిని ప్రభుత్వ నిర్వహణలోని అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ (యూఎస్‌టీడీఏ) డిప్యూటీ డైరెక్టర్‌, ప్రధాన నిర్వహణ అధికారి (సీఓఓ)గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించారు. విదేశాలతో అమెరికాతో వాణిజ్య అభివృద్ధి యూఎస్‌టీడీఏ కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన వినయ్‌ 1974లో అమెరికా వచ్చారు. అమెరికాలో ఉన్నత విద్యాబ్యాసం చేసేటప్పుడు వినయ్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామాకు రూమ్మేట్‌గా ఉన్నారు. ఒబామా తన హయాంలో వినయ్‌ను సెంట్రల్‌ అమెరికా దేశమైన బెలిజికి అమెరికా రాయబారిగా నియమించారు.

ఈ నియామకానికి ముందు వినయ్ తుమ్మలపల్లి 2013 నుండి 2017 వరకు యునైటెడ్ స్టేట్స్‌లో యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌లో సెలెక్ట్‌ యూఎస్‌ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో మొట్టమొదటి భారతీయ అమెరికన్ అంబాసిడర్‌గా పనిచేశారు. 2009 నుండి 2013 వరకు బెలిజ్‌లో యుఎస్ అంబాసిడర్‌గా కూడా చేశాడు.

“ప్రెసిడెంట్ బిడెన్ వినయ్ తుమ్మలపల్లిని యుఎస్‌టిడిఎ డిప్యూటీ డైరెక్టర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించారు. సెనేట్ ద్వారా డైరెక్టర్ ధృవీకరించబడే వరకు తుమ్మలపల్లి యుఎస్‌టిడిఎ యాక్టింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు” అని యుఎస్‌టిడిఎ తెలిపింది.

ఇవి కూడా చదవండి: LPG Gas Booking – WhatsApp: వాట్సాప్‌తో ఓ మెసెజ్‌ చేస్తే చాలు మీ LPG గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది.. ఎలా చేయాలో తెలుసా..

Online Shopping: భారీ ఆఫర్లు ఉన్నాయని ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఈ ఐదు సంగతులు గుర్తుంచుకోండి..