దేశ, విదేశాల్లో ఉన్న భారతీయులు దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. తన అధికారిక నివాసం నేవల్ అబ్జర్వేటరీలో దీపావళి వేడుకలు నిర్వహించారు. నీరా టాండన్, వివేక్ మూర్తి, రిచ్ వర్మ, అజయ్ భూటోరియాతో సహా పలువురు ప్రముఖ భారతీయ-అమెరికన్లు ఈ వేడుకకు హాజరయ్యారు. కమలా హారిస్ దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
కమలా హారిస్ తన భర్తతో కలసి సంతోషంగా దీపావళి వేడుకలను జరుపుకోవడం వీడియో లో చూడవచ్చు. కమలా హారిస్‌తో పాటు, ప్రజలు కూడా ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వేడుకల సందర్భంగా ఆమె తన నివాసాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతోపాటు భారతీయ వంటకాలతో విందునిచ్చారు.
దీపావళి వేడుకలు:
.@VP and @SecondGentleman during a Diwali Celebration at the VP’s Residence this evening.
?: neilmakhija on Instagram. pic.twitter.com/w8wq7tu1PB
— best of kamala harris (@archivekamala) October 22, 2022
చీకటి,కాంతిని సమతుల్యం చేసే పండుగ
భారతీయ-అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మాట్లాడుతూ దీపావళి పండుగ అనేది సంస్కృతులకు అతీతమైన సార్వత్రిక భావన అన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పండగ సంస్కృతికి సంబంధించినది. దీపావళి విశిష్టతను వివరిస్తూ.. సంస్కృతులు, వర్గాలకు అతీతంగా అనాదిగా వస్తున్న భావన. చీకటికి, వెలుతురుకు మధ్య సమతుల్యతను పాటిస్తూ జీవితాన్ని గడపాలని దీపావళి నేర్పుతుందని అన్నారు.
కొన్ని శక్తివంతమైన శక్తులు మనల్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నాయి
దీపావళి అంటే వెలుగులు నింపే పండుగ అని కమలా హారిస్ అన్నారు. చీకట్లోంచి వెలుగులోకి ప్రయాణం చేయడానికి మన పాత్ర ఏమిటో ఈ దీపావళి నేర్పుతుందని అన్నారు. ఏదో ఒక శక్తివంతమైన శక్తి మనల్ని విభజించడానికి ప్రయత్నిస్తోందని కొన్నేళ్లుగా మనం గ్రహించామని అన్నారు. కొన్ని సమస్యల పై దృష్టి పెట్టినప్పుడు.. అసమానతలు ఉన్నాయని తెలిసిందని.. వాటిని ఉమ్మడిగా ఎదుర్కోవాలని సూచించారు.
మరిన్ని గ్లోబల్ భారత్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..