గాంధీ జయంతి వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. వాషింగ్టన్ డిసి డెమోక్రాటిక్ పార్టీ నాయకులు శ్రీధర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహాసభకు భారీగా ఎన్‌ఆర్ఐలు హాజరయ్యారు. లౌడెన్ కౌంటీ.. వర్జీనియా రాష్ట్రంలోని శ్రీనివాస్ నిష్టాలకు చెందిన ఫామ్ హౌస్‌లో మహాసభ జరిగింది. ఇది ప్రవాస భారతీయ నాయకులు తొలిసారిగా స్థానికంగా నిర్వహించిన అతి పెద్ద కార్యక్రమం. ఈ సమావేశానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్హాహాఫ్ (సెకండ్ జెంటల్మన్ ఆఫ్ అమెరికా) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గత వర్జీనియా గవర్నర్, ప్రస్తుత ఎన్నికలలో పోటీ చేస్తున్న టెర్రీ మెకాలిఫ్, అటార్నీ జనరల్‌గా పోటీ చేస్తున్న మార్క్ హేరింగ్, అమెరికా రెప్రజెంటేటివ్ జెన్నిఫర్ వెక్స్టన్, వర్జీనియా సెనెటర్ జెన్నిఫర్ బాయిస్కో, డెలిగేట్ సుహాస్ సుబ్రహ్మణ్యం, డెలిగేట్ వెండీ గూడిటిస్ కూడా హాజరయ్యారు. ఈ సభకు మన ప్రవాస భారతీయులు ముఖ్యంగా
యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో కార్యక్రమం సందడిగా సాగింది. అన్ని ప్రవాస తెలుగు, భారతీయ జాతీయ, ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు వచ్చారు.
అమెరికాలో సంపన్నవంతమైన ప్రాంతాల్లో వర్జీనియాలోని లౌడన్ కౌంటీ మొదటి వరుసలో ఉంటుంది. అత్యధిక ఆదాయం వచ్చే చాలా మంది ప్రవాస భారతీయులు ఇక్కడే నివసిస్తున్నారు. 400 సంవత్సరాల అమెరికా చరిత్రలో తొలి సారి ప్రవాస భారతీయులు, డెమోక్రాటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన సుహాస్ సుబ్రహ్మణ్యం వర్జీనియా డెలిగేట్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయంలో పార్టీ నాయకులు శ్రీధర్ నాగిరెడ్డి గారి పాత్ర ఎంతో ఉంది. వారు ఇటీవల జరిగిన స్థానిక కౌంటీ ఎన్నికలలో పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. అయితే.. ప్రస్తుత గవర్నర్ రాల్ఫ్ నార్తమ్ ఒక సారి గవర్నర్ పదవిని నిర్వహించిన కారణంగా రెండవ సారి మళ్ళీ పోటీ చేయడానికి అమెరికాలో నిబంధనలు అనుమతించవు.
వర్జీనియా రాష్ట్రంలో, డెమోక్రాటిక్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాలలో వివిధ రంగాలలో జరిగిన.. జరుగుతున్న అభివృద్ధిని ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య, హై టెక్నాలజీ, ఎంప్లాయిమెంట్, కోవిడ్ వైరస్ కంట్రోల్,
ఇమిగ్రేషన్, బిజినెస్ ఫ్రెండ్లీ వంటి అంశాలపై వక్తలు ప్రసంగించారు. అయితే ఇవన్నీ కొనసాగాలంటే వచ్చే నెల (నవంబరు) 2 వ తేదీ జరుగబోయే ఎన్నికలల్లో టెర్రీని గవర్నర్‌గా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ప్రవాస భారతీయులను విజ్ఞప్తి చేసారు. అమెరికా అధ్యక్షులు జోసఫ్ బైడన్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. రిపబ్లికన్ పార్టీ అభివృద్ధి నిరోధక, తిరోగమన విధానాలను తిప్పికొట్టారు. హాజరైన ప్రజలు పెద్దఎత్తున ఉత్సాహంతో కరతాళ ధ్వనులతో సభను విజయవంతం చేసారు.
ఇవి కూడా చదవండి: Basil: తులసితో ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే ఆశ్యర్యపోతారు.. తాజా అధ్యయనంలో వెల్లడి..!
PM Narendra Modi: విమర్శలు వేరు.. ఆరోపణలు వేరు.. పదవులకన్నా ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ